అమరావతి
2.94 లక్షల కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టారు.
రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34లక్షల కోట్లు..
ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు,
రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు..
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ. 16.739 కోట్లు,
జలవనరులు రూ.16,705 కోట్లు..
ఉన్నత విద్య రూ.2326 కోట్లు..
పట్టణాభివృద్ధి రూ.11490 కోట్లు..
పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127 కోట్లు..
ఇంధన రంగం రూ.8,207 కోట్లు..
పోలీస్ శాఖ రూ. 8495 కోట్లు..
బీసీ సంక్షేమం రూ.3,907 కోట్లు..
మైనారిటీ సంక్షేమం రూ.4,376 కోట్లు..
ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు..
అటవీ పర్యావరణ శాఖ రూ.687 కోట్లు..
గృహ నిర్మాణం రూ. 4,012 కోట్లు..
నైపుణ్యాభివృద్ధి శాఖ రూ.1,215 కోట్లు.
మంత్రి మాట్లాడుతూ సమాచార విప్లవాన్ని వినియోగించుకోవాలి. శాశ్వత రాజధాని లేకుండా రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్రాన్ని పునర్మిర్మాణ దిశగా నడిపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంది. గత ప్రభుత్వం నీటి పారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లలేదు. గత ప్రభుత్వం ఉత్పాదక మూలధనాన్ని నిలిపివేసింది. తద్వారా ఉత్పత్తి తగ్గిపోయి అభివృద్ధికి ఆటంకం కలిగిందని అన్నారు.
దీపం పథకానికి రూ.895 కోట్లు కేటాయించాం. దీపం పథకం ద్వారా 5 లక్షల మందికి లబ్ధి కలుగుతుంది. వచ్చే మూడేళ్లలో 18 వేల మంది అధ్యాపకులకు శిక్షణాభివృద్ధి కార్యక్రమం చేపడతాం. పాఠశాల విద్యాశాఖకు రూ.29,909 కోట్లు కేటాయించాం. ఉపాధ్యాయులపై యాప్ భారం తగ్గింపు వుంటుంది. 192 నైపుణ్య కేంద్రాలు, కళాశాలల ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.