విజయవాడ, నవంబర్ 12,
ఏపీలో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు తీవ్ ఒత్తిడికి గురవుతున్నాయి.సోషల్ మీడియాలో వారు పెట్టిన పోస్టుల్లో మార్ఫింగ్‌లు, బూతులు ఉంటే ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. కుటుంబాలను దూషిస్తూ ఐదేళ్ల పాటు వారు సేఫ్ గా ఉన్నారు.నిజానికి ఇలాంటి వారిలో అత్యధిక మంది ప్రభుత్వ డిజిటల్ కార్పొరేషన్ నుంచో.. మరో ప్రభుత్వ వ్యవస్థ నుంచో జీతాలు తీసుకుంటూ వచ్చారు. అలా జీతాలు తీసుకుంటూ అప్పట్లో పెట్టిన పోస్టులే ఇప్పుడు అరెస్టులకు కారణం అవుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ వైసీపీ సోషల్ మీడియాను వ్యవస్థీకృత మాఫియాగా చెబుతోంది. దేశ విదేశాల్లో ఉన్న వారికి డబ్బులు ఇచ్చి మరీ పోస్టులు పెట్టిస్తున్నారని అంటున్నారు. గతంలో న్యాయమూర్తులపై పోస్టులు పెట్టింది కూడా వీరేనని..అలాగే.. టీడీపీ, బీజేపీ, జనసేన అగ్రనేతలు.. వారి కుటుంబాలపై ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేసింది కూడా వీలైనని అంటున్నారు. ఫేక్ అకౌంట్లతో వస్తున్నారని వీరందరినీ ఇప్పుడు బయటకు తీశారు. కనీసం రెండువందల మందిని ఇప్పటి వరకూ అదుపులోకి తీసుకున్నారు. వీరి పోస్టులన్నీ అత్యంత జుగుప్సాకరంగా ఉండటంతో న్యాయస్థానాల్లోనూ ఊరట దక్కడం కష్టంగా మారింది. వైసీపీ సోషల్ మీడియా గీత దాటిపోయిందని కూటమి ప్రభుత్వం ముందే చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టులు చేయలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక.. నర్రా రవీంద్రారెడ్డి, ఇంటూరి రవికిరణ్ వంటి వాళ్లకు ఇన్ స్టంట్ ట్రీట్మెంట్ ఉంటుందని టీడీపీ క్యాడర్ అనుకున్నారు. కానీ వాళ్లకు కూడా నోటీసులు ఇచ్చి పంపేశారు. దీంతో టీడీపీ క్యాడర్ లో అసహనం కనిపించింది. నాలుగు నెలల పాటు ఇలాగే జరిగింది. ఇక తమకు అడ్డుఅదుపూ లేదనుకున్నారు. అందరూ బయటకు వచ్చారు. సరైన సమయం చూసి ఏపీ ప్రభుత్వం పంజా విసిరింది. అంటే ఒకరిద్దర్ని జైలుకు పంపి మిగతా వారికి వియ్ స్టాండ్ పోస్టులు వేసే అవకాశం ఇవ్వలేదు. అందర్నీ ఒకే సారి లోపలేస్తున్నారు. కొంత మందిపై పోక్సో చట్టం ప్రకారం కూడా కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో వైసీపీ సోషల్ మీడియా ఒక్క సారిగా నిస్తేజంగా మారిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. కొంత మంది వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేస్తున్నారు. ఎందుకైనా మంచిదని క్షమాపణల వీడియోలు పెడుతున్నరాు. శ్రీరెడ్డి అనే సోషల్ మీడియా కార్యకర్తతో పాటు కాదు పదుల సంఖ్యలో ఇలాంటి సారీ ప్రకటనలు కనిపిస్తన్నాయి. సోషల్ మీడియా అరెస్టులపై లోకల్ ఇంచార్జులు అసలు పట్టించుకోవడం మావేశారు. ఫేక్ అకౌంట్లతో బూతులు మాట్లాడిన వారి కోసం ఎవరూ రావడం లేదు. చాలా మంది ఫేక్ పోస్టులతో వైసీపీ ఆఫీసు నుంచి వచ్చిన కంటెంట్ షేర్ చేసిన వారు ఇప్పుడు అవి చేసింది తామేనని బయటకు తెలియడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇంటి చుట్టుపక్కల వారు కూడా అసహ్యించుకునే పరిస్థితి కనిపిస్తోంది. వీరందరికి భరోసా ఇవ్వకపోతే పార్టీకి పని చేసేందుకు భయపడతారని క్యాడర్ అనుకుంటోంది.