హైదరాబాద్
మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ కుటుంబం చేసిన అవినీతిపై తక్షణమే విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సమితి ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నట్లు తెలంగాణ రక్షణ సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ తెలిపారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.... తెలంగాణ ప్రాంతాన్ని ప్రజలను మోసం చేసి వేల కోట్ల విధ్వంసానికి కారణమైన కేసిఆర్ అవినీతిపై రాష్ట్రమంతటా పాదయాత్ర తీసి తెలంగాణ ప్రజలకు జరిగిన అవినీతి గురించి తెలియజేస్తామని వారన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో వేలకోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నారు తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలు అని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన ఘనత దక్కిందని తెలిపారు కేసీఆర్ అవినీతిపై సిబిఐ ఈడి అధికారులు తక్షణమే విచారణ జరిపించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు