రంగారెడ్డి
శేరిలింగంపల్లి నియోజక వర్గం వివేకానంద నగర్ డివిజన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా వెలమ కులస్తులు గళం విప్పారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక కులాన్ని ఉద్దేశించి మాట్లాడటంపై మండిపడ్డారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం కానీ నోరు తెరిస్తే బూతులు మాట్లాడే రేవంత్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు. రేవంత్ రెడ్డి ఒక జాతికి ముఖ్యమంత్రి కాదు..తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయారు. మాట్లాడితే ఎవడైనా అడ్డొస్తే బుల్లోజర్ లు పెట్టీ తొక్కిస్తా అంటున్నావు . అందుకేనా నిన్ను ఓట్లు వేసి గెలిపించింది. ఇకనైనా మాట్లాడే పద్ధతి మార్చుకొని అభివృదిపై దృష్టిపెట్టండి. జలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయండని అన్నారు.