YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

లగిచెర్ల అరెస్టులను ఖండించిన ఈటల

లగిచెర్ల అరెస్టులను ఖండించిన ఈటల

న్యూఢిల్లీ
లగిచెర్ల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్రమ కేసులు పెడితే మంచిది కాదని హెచ్చరిస్తున్నామని ఎంపి ఈటల రాజేందర్ అన్నారు. వారి మీద కేసులు పెడితే యావత్ తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తుందని హెచ్చరిస్తున్నాం. ఫార్మా కంపెనీలకు అవసరమైతే వారే భూసేకరణ చేసుకుంటారు కానీ ప్రభుత్వం మధ్యలో బ్రోకర్ లాగా వ్యవహరించాల్సిన అవసరం లేదు.  నీకు ఓట్లు వేసింది బ్రోకర్ గిరి చేయడానికి, మధ్యవర్తిత్వం చేయడానికి కాదు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల గ్రామంలో ఫార్మాసిటీ కోసం భూములు సేకరించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.  దీనిని అక్కడ రైతాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
మా భూములు గుంజుకోకండి, మా ఉపాధి మీద దెబ్బకొట్టకండి అని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినకుండా ఫార్మా కంపెనీలకు రైతుల భూములను అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.  దీనిని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేశారు, నిరసనలు తెలిపారు, గ్రామసభలను బహిష్కరించారు. స్వయంగా ఎంపీ డీకే అరుణ గారి ఆధ్వర్యంలో ధర్నాలు కూడా నిర్వహించారు. అయినప్పటికీ వారి మాట పెడచెవిన పెట్టి ప్రభుత్వం భూసేకరణ కోసం సమావేశం ఏర్పాటు చేసింది. దీనితో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  దీనిని అడ్డం పెట్టుకొని కొడంగల్ చుట్టుపక్కల మండలాల్లో ఇంటర్నెట్, కరెంటు బంద్ చేసి వందల మంది పోలీసులు గ్రామాలలో మోహరించి అరెస్టు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.  అక్రమ కేసులు పెడితే మంచిది కాదని హెచ్చరిస్తున్నాము.  భూ సేకరణ రైతుల ఇష్ట ప్రకారం చేయాలి తప్ప బలవంతంగా తీసుకునే అధికారం మీకు ఇవ్వలేదు.  గతంలో ముచ్చర్లలో ఫార్మసిటీ కోసం 8 లక్షలకు భూములు సేకరించి కోటి రెండు కోట్లకు ఫార్మా కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నం చేసినాడు ఇదే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది.  బీజేపీగా మేము కూడా వ్యవహరించే వ్యతిరేకించాము.  అప్పుడు వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు భూములు గుంజుకుని రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.  ప్రభుత్వపరమైన భూములు ఇవ్వండి కానీ ప్రైవేటు వ్యక్తుల భూములు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నాను.
రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలో ఉద్యోగ కల్పన చేస్తామని చెప్తున్నారు, కానీ ఇప్పటివరకు భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం ఇవ్వలేదు, ఇచ్చిన హామీలు అమలు కాలేదు.  ఫార్మా కంపెనీలకు అవసరమైతే వారే భూసేకరణ చేసుకుంటారు కానీ ప్రభుత్వం మధ్యలో బ్రోకర్ లాగా వ్యవహరించాల్సిన అవసరం లేదు.  
నీకు ఓట్లు వేసింది బ్రోకర్ గిరి చేయడానికి, మధ్యవర్తిత్వం చేయడానికి కాదని అన్నారు.

Related Posts