కడప
రాష్ట్ర ప్రజలను చంద్రబాబు సర్కార్ దగా చేసిందంటూ వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికలప్పుడు కూటమిగా ఏర్పడి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే వెంటనే వాటిని అమలు చేస్తామని ఓటు అడిగారు. మహిళకు 15 వేలు, ఉచిత బస్సు, నిరుద్యోగులకు 3వేల భృతి ఇస్తామన్నారు. 20 వేలు రైతుకు, 25 లక్షల ఉద్యోగాలు ఇలా అనేకం సూపర్ సిక్స్, మేనిఫెస్టో ఉన్నాయి. గెలిచిన వెంటనే అమలు చేస్తామని వాగ్దానం చేశారు. 6 నెలలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో కాలయాపన చేశారు. నిన్న పూర్తి బడ్జెట్ పెట్టారు.. దాంట్లో మీరిచ్చిన ఈ ఒక్క హామీ కనిపించలేదంటూ రామమల్లు నిలదీశారు.