YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేటీఆర్ ఢిల్లీ టూర్ అందుకేనా

కేటీఆర్ ఢిల్లీ టూర్ అందుకేనా

హైదరాబాద్, నవంబర్ 13,
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సడెన్‌గా ఢిల్లీలో ల్యాండ్‌ అయ్యారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆయన పర్యటన వెనక స్వకార్యం, స్వామి కార్యం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అప్రకటిత ప్రతిపక్ష నేత.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.. మాజీ ముఖ్యమైన మంత్రి.. కల్వకుంట్ల తారాకరామారావు.. సడెన్‌గా ఢిల్లీలో ల్యాండ్‌ అయ్యారు. ఆయన ఇప్పుడు మంత్రి కాదు.. నిధులు తీసుకురావడానికి కంపెనీలతో చర్చల కోసం వెళ్లలేదు. కానీ సడెన్‌గా ఢిల్లీ టూర్‌ పెట్టుకున్నారు. మూడు నెలల క్రితం అమెరికా వెళ్లొచ్చాడు. ఆయన వచ్చాక ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు గ్రీన్‌ కార్డు పొందారు. ఈ నేపథ్యంలో తాజాగా కేటీఆర్‌ ఢిల్లీ పర్యటన వెనుక కూడా రహస్య ఎజెండా ఉందన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ మంత్రులు అయితే.. ఫార్ములా రేస్‌ కేసులో విదేశీ కంపెనీకి కేటాయించిన రూ.55 కోట్ల కేసు నుంచి తప్పించుకునేందు బీజేపీతో ములాఖత్‌ అయ్యారని ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే ఢిల్లీ వెళ్లారని పేర్కొంటున్నారు. అయితే బీజేపీతో ములాఖత్‌ నిజమే అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. అమృత్‌ టెండర్లు ఆరు నెలల క్రితమే ఖరారు అయ్యాయి. రెండు నెలల క్రితమే ఆయన అక్రమాల విషయం చెప్పారు. బీజేపీ నేతలకు సవాల్‌ చేశారు. కానీ, ఢిల్లీ వెళ్లడం కోసమే ముగిసిపోయిన ఎపిసోడ్‌ను తెరపైకి తెచ్చారని తెలుస్తోంది. కేంద్ర మంత్రులు.. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీ నేతలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చేవారు కాదు. ఈ విషయాన్ని నాటి మంత్రులే స్వయంగా చెప్పారు. తమను చిన్న చూపు చూశారని, అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా అవమానించారని వాపోయారు. కానీ, ఇప్పుడు అధికారంలో లేకపోయినా.. కేంద్ర మంత్రి అపాయింట్‌మెంట్‌ సడెన్‌గా దొరకడం అనుమానాలకు తావిస్తోంది. కేటీఆర్‌ ఢిల్టీ టూర్‌ వెనుక బీజేపీ బిగ్‌ స్కెచ్‌ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే కేసీఆర్‌ హస్తిన వెళ్లారని, ఈ టూర్‌లో స్వామి కార్యంతోపాటు స్వకార్యం చేసుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఇక కేంద్ర మంత్రికి అమృత్‌ టెండర్లపై ఫిర్యాదు అనంతరం కేటీఆర్‌ ఢిల్లీలోనే ప్రెస్‌మీట్‌ పెట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఈ ప్రెస్‌మీట్‌ తర్వాత కేటీఆర్‌ ఢిల్లీ టూర్‌ ఉద్దేశం కాంగ్రెస్‌ నేతలకు బోధపడింది. ప్రస్తుతం దేశంలో మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మహారాష్ట్రకు వెళ్లి తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌కు పాజిటివ్‌ అయ్యే అవకాశం ఉంది. దీంతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను ఓడించేందకు బీజేపీకి అస్త్రాలు ఇవ్వాలని ఢిల్లీ వెళ్లారని తెలుస్తోంది. ఈ పర్యటన పక్కాగా బీజేపీ ప్లాన్‌ అని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. రెండు రోజులు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గొననున్నారరని, అందుకే కేటీఆర్‌ ఢిల్లీ వెళ్లాడని పేర్కొంటున్నారు. మహారాష్ట్రలో బీజేపీని గెలిపించాలనే కేటీఆర్‌తో కమలం నేతలు ఈ ఎత్తుగడ వేయించారని ఆరోపిస్తున్నారు. 

Related Posts