ఢిల్లీ,
మహారాష్ట్రలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. తాజాగా ముంబైలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం నిర్మూలించారని వ్యాఖ్యానించారు. రాహుల్, మీ నాలుగు తరాలొచ్చినా కశ్మీర్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ సాధ్యం కాదు, అని అన్నారు. బీజేపీకి రాజకీయ అధికారం కన్నా కశ్మీర్ సమస్యే హృదయానికి దగ్గరగా ఉంటుందన్నారు.