వికారాబాద్
ఎంపి డికె అరుణ బుధవారం నాడు కొడంగల్ కు వచ్చారు. ఆమెను మన్నెగూడ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. డికె ఆరుణ పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నేను ఎంపీగా నా నియోజకవర్గంలో పరామర్శించొద్దా..? నేను ఎంపీనీ నేను ఏ తప్పు చేశామని అడ్డుకుంటున్నారో చెప్పండి. ముఖ్యమంత్రి వల్లే జిల్లాలో లా & ఆర్డర్ సమస్య వచ్చింది. ను జిల్లా కలెక్టర్ ను కలిసేందుకు వెళ్తున్నాం. నేను నా నియోజకవర్గం లో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంది. తన సొంత నియోజకవర్గంలో లా & ఆర్డర్ కంట్రోల్ చేసుకోలేక పోయారని అన్నారు. మేము ఏమైనా లా & ఆర్డర్ బ్రేక్ చేసే పని ఏమీ చేయడం లేదు. కలెక్టర్ ను కలుస్తామని అపాయింట్మెంట్ ఉంది. సీఎం రెవంత్ రెడ్డి వల్ల లా & ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది. రేవంత్ రెఢ్డిని అరెస్ట్ చేయండి . రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి వెళ్తే లా & ఆర్డర్ ప్రాబ్లమ్ రాదా..? ముఖ్యమంత్రి గారి అన్నను పంపిస్తారు.. ఎంపీగా నేను వెళ్లకూడదా..? ఇదేక్కడి దౌర్జన్యం.. రాష్ట్రంలో ఎంపీగా నా నియోజకవర్గంలో నేను పర్యటించొద్దా..? నేను స్టేషన్ లోకి ఎందుకు వస్తాను, నేనేం తప్పు చేశానని ప్రశ్నించారు.