బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర జరిగింది. హర్యానా రాష్ట్రానికి చెందిన గ్యాంగ్ స్టర్ సంపత్ నెహ్రాను హైదరాబాద్ లో పోలీసులు మూడు రోజుల క్రితం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో సంచలన విషయాలను బయటపెట్టాడు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను హత్యకు కుట్ర పన్నుతున్నట్టు చెప్పాడు. ఇందుకోసం ముంబైలోని సల్మాన్ నివాసం వద్ద రెక్కీ కూడా నిర్వహించానని, సల్మాన్ ఇంటిని, అతను వెళ్లే మార్గాలను తన ఫోన్ లో ఫొటోలు తీసుకున్నట్టు ఈ విచారణలో బయటపడింది.