YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మంచి మార్పు కోసమే కుటుంబ సర్వే మంత్రి పొన్నం

మంచి మార్పు కోసమే కుటుంబ సర్వే మంత్రి పొన్నం

హైదరాబాద్
బంజారాహిల్స్ ఎన్బీటీ  నగర్ లోని ఎన్ క్లెవ్ అపార్ట్మెంట్స్ లో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి తో కలిసి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో పాల్గొన్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో భాగంగా మహమ్మద్ నయీం కుటుంబానికి సంబంధించిన వివరాలు నమోదు చేసారు. తరువాత  బంజారాహిల్స్ లోని  మిథాలీ నగర్ ప్లాట్ నెంబర్ 66&35 లో మదిరెడ్డి ఉషశ్రీ , కిరణ్ కుటుంబాల్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో పాల్గొన్నారు..ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురషెట్టి,అడిషనల్ కమిషనర్ స్నేహ శబరిష్ ఇతర అధికారులు పాల్గోన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా 6 వ తేది నుండి ఇల్ల గుర్తింపు కార్యక్రమం 9 వ తేది నుండి ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభం అయింది. తెలంగాణ ప్రజల యొక్క స్థితిగతులు భవిష్యత్తు ప్రభుత్వ ప్రణాళిక ద్వారా మంచి మార్పు తీసుకువచ్చి ఆదర్శవంతమైన తెలంగాణ గా రాష్ట్ర ప్రజలను భాగస్వామ్యులను  చేసుకుని ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుంది. ఈ సర్వే తెలంగాణ దేశానికి దిక్సూచిగా ఉండే విధంగా జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 30 శాతం సర్వే  పూర్తైంది. జీహెచ్ఎంసీ పరిధిలో లో 4 లక్షల 50 వేల పైగా ఇళ్లకు  సర్వే జరుగుతుంది. రాష్ట్రంలో 85 వేలకు పైగా ఎన్యుమరేటర్స్ సర్వే చేస్తున్నారు. ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇక్కడ ఇన్యుమరెటర్స్ అడిగితే  150 ఇళ్లకు కేటాయించగా ఇప్పటి వరకు 26 ఇళ్లు పూర్తి చేశామని తెలిపారు. ఎక్కడ ఇబ్బంది లేదని చెప్తున్నారు. ప్రభుత్వం పక్షాన ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న. ఈ సర్వే వల్ల ఎలాంటి పథకాలు కట్ కావు.. ఇంకా పథకాలు అమలవుతాయి. దీని వల్ల ఎలాంటి అనుమానాలు అవసరం లేదు.. సమాచారం గోప్యంగా ఉంటుంది. దీని ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్గదర్శకత్వం చేశారు. ప్రధాన మంత్రి స్పందించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. క్యాబినెట్ తీర్మానం తర్వాత అసెంబ్లీలో కూడా తీర్మానం పెట్టుకుంటామని అన్నారు.
గతంలో సర్వే చేయాలని అనేక దీక్షలు ధర్నాకు చేసిన వారు సైలెంట్ గా ఉన్నారు.. అందరూ స్వాగతిస్తున్నారు. తెలంగాణలో ఉన్న అన్ని కుల సంఘాలను విజ్ఞప్తి చేస్తున్న మీ కులాలను చైతన్య పరచండి  సర్వే సందర్భంగా మీ కులాలను భాగస్వామ్యం కమ్మనండి. బ్యాంక్ అకౌంట్ డిటైల్స్ అడగడం లేదు.. ఉందా లేదా అని సమాచారం మాత్రమే అడుగుతున్నాం. బ్యాంక్ ఖాతా కి ఆప్షన్ అడుగుతున్నాం. ఆధార్ కార్డు తప్పనిసరి కాదు. ఈ చారిత్రాత్మక కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది.. అందరూ సహకరించాలి. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అధికారులు జిల్లా కలెక్టర్ లు మీ అనుమానాలు నివృత్తి చేస్తారు. ఎన్యుమరేటెర్స్ కి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అధికారుల దృష్టికి తీసుకురండి.. ప్రభుత్వ ఉద్యోగుల ఆటంకానికి ఇబ్బందులు కలిగిస్తే చర్యలు ఉంటాయి. 33 జిల్లాలో 85 వేల మంది ఎన్యుమరేటర్స్ సర్వే చేస్తున్నారు.  ప్రైవేట్ వ్యక్తులు  ఎవరు లేరు. ఐడెంటి కార్డు ఉంది వాళ్ళు ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే నిర్వహిస్తున్నారని అన్నారు.
సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు ఉంటాయి. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. తమిళనాడు , మహారాష్ట్ర భిన్నం. తెలంగాణ దేశానికి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఆదర్శంగా నిలుస్తుంది. ఈ సమాచారం అధ్యయనం చేసి ఏ వర్గాలకు అయితే న్యాయం జరగలేదో వారికి న్యాయం చేసి దిశ దశ గా ఉంటుందని అన్నారు.

Related Posts