హైదరాబాద్
లగిచర్ల లడాయి ప్రభుత్వం వెర్సస్ బీఆర్ఎస్ గా మారింది. అధికారుల ఫై జరిగిన దాడి ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇది ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర గా మంత్రుల ఆరోపణలు. ఎవరిని వదిలిపెట్టమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు బుధవారం అరెస్టు చేపిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగు చూసాయి. కేటీఆర్ ఆదేశాల మేరకే దాడి అని పట్నం నరేందర్ కన్ఫెషన్ ఇచ్చినట్లు పేర్కోన్నారు. కేటీఆర్ అరెస్ట్ చేస్తారని రాత్రి నుంచే నంది నగర్ లో కేటీఆర్ ఇంటికి బీఆర్ఎస్ నేతలు వచ్చారు. కేటీఆర్ నివాసం లోనే హరీష్, జగదీశ్ రెడ్డి, శ్రీనివాసగౌడ్. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వున్నారు. నేను అరెస్టుకు కి రెడీ అని కేటీఆర్ ట్వీట్ చేసారు. రైతుల గొంతు అయినందుకు అరెస్ట్ చేస్తే గర్వాంగ పోతానని ట్వీట్ లో పేర్కోన్నారు. అరెస్ట్ చేయండని సవాల్ విసిరారు.