హైదరాబాద్
వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్ట్ అయి బుధవారం నుంచి చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, చర్లపల్లి జైలుకు చేరుకుని ములాఖాత్ అయ్యారు. అయన వెంట బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్తీక్ రెడ్డి, నందికంటి శ్రీధర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.