ముంబై నవంబర్ 14
ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. విమానాశ్రయాన్ని పేల్చేసేందుకు కుట్ర జరుగుతోందంటూ బుధవారం మధ్యాహ్నం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ కాల్ వచ్చింది. అజర్‌బైజాన్ కు వెళ్తున్న మహమ్మద్ అనే ప్రయాణికుడు విమానంలో పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్నట్లు సదరు కాలర్ హెచ్చరించాడు.బెదిరింపు కాల్‌తో అప్రమత్తమైన సీఐఎస్‌ఎఫ్ వెంటనే సహార్ పోలీసులను అప్రమత్తం చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు విమానాశ్రయం ఆవరణలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనతో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.