YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అన్ని ఆధారాలతోనే కొడంగల్ నిందితులపై చర్యలు

అన్ని ఆధారాలతోనే కొడంగల్ నిందితులపై చర్యలు

హైదరాబాద్
వికారాబాద్ జిల్లా కలెక్టర్ దాడి విషయంలో అన్ని ఆధారాలతోనే భాద్యులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని... ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టడం లేదని మాజీ మంత్రి , ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కార్పొరేటర్ లతో కలిసి కల్యాణ లక్ష్మీ , షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు దానం అందజేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలలో కూడా ఉద్దేశపూర్వకంగా కొంతమంది నాయకుల ఫోన్లు ట్యాపింగ్ కు గురయ్యాయని దానం తెలిపారు. వాటి ఆధారాలతోనే మాజీ ఎమ్మెల్యే లకు నోటీసులు ఇచ్చారన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే కల్యాణ లక్ష్మీ , షాది ముబారక్ వంటి సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని... ప్రజా ప్రభుత్వంలో ఆలస్యం అయిన లబ్ధిదారులకు అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని దానం స్పష్టం చేశారు.

Related Posts