YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మల్లారెడ్డి మోసం చేసాడు

మల్లారెడ్డి మోసం చేసాడు

హైదరాబాద్
బంధువే కదా అని నమ్మితే మాజీ మంత్రి మల్లారెడ్డి మోసం చేసాడని దోమల్ గూడాకు చెందిన బాధితుడు, 87 ఏళ్ల వృద్ధ రైతు కళ్లెం నర్సింహా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. మల్లారెడ్డి తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పించి ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితుడు మాట్లాడుతూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, శామీర్పేట మండలం, యాడారం గ్రామంలో సర్వే నంబర్ 249,250 ఏ.23.26 ఎకరాల(23 ఎకరాల 26 గుంటలు) 1982 సం.లో తన కష్టార్జితంతో కొన్న భూమి ఉందన్నారు. అయితే ఈ భూమిని తాను కొంటానంటూ బంధువుల ద్వారా పలు మార్లు మల్లారెడ్డి అడిగాడని తెలిపారు. అందులో నుండి మొదట మొత్తం భూమి కొనుగోలు చేస్తానని చెప్పిన మల్లారెడ్డి అనంతరం 9.29 ఎకరాలు కొనుగోలు చేస్తానని చెప్పాడని తెలిపారు. ఒక్కో ఎకరానికి రూ.2.25 కోట్లు 9.29 ఎకరాలకు గాను మొత్తం రూ.21.88 కోట్లకు ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. అందుకు ఎంవోయూ అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం విడతల వారిగా రూ.8.03 కోట్లు చెల్లించారని, అయితే మిగతా 14 కోట్లు చెల్లించకుండా తర్వాత ఇస్తానని నమ్మించి తన కొడుకు సీహెచ్.మహేందర్ రెడ్డి కంపెనీ అయిన సీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుపై జూన్ నెలలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాని తెలిపారు. రూ.14 కోట్లకు గాను చెక్కులు ఇచ్చారని, గత 40 రోజులుగా డబ్బు అడిగితే మల్లారెడ్డి స్పందించడం లేదని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు.

Related Posts