YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అమరావతి కోసం అదిరిపోయే ప్లాన్

 అమరావతి కోసం అదిరిపోయే ప్లాన్

విజయవాడ, నవంబర్ 18,
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని వేరే లెవల్‌కు తీసుకెళ్లాలని ప్రభుత్వం ప్లాన్ రెడీ చేస్తోంది. చుట్టుపక్కల ఉన్న నగరాలను కలుపుకొని దీన్ని మెగా సిటీగా రూపకల్పన చేయాలని భావిస్తోంది. కొత్త రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్‌ మతిపోయేలా చేస్తోంది. కోటి మంది జనాభాతో ప్రపంచంలోనే టాప్ మెగా సిటీగా తీర్చిదిద్దాలని స్కెచ్ వేస్తోంది ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగానే ప్రతిపాదనలు రెడీ చేసింది. అమరావతితోపాటు విజయవాడ, గుంటూరు, మంగళగిరిని కూడా వేరే లెవల్‌క తీసుకెళ్లాలని సీఆర్డీఏను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాజధాని పరిధిలో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నప్పటికీ దాని ఎఫెక్ట్‌తో జరిగే అభివృద్ధిని మాత్రం మిగతా మూడు నగరాలకు వ్యాప్తి చెందేలా చూస్తున్నారు. అందుకోసం ఈ నగరాల్లో ప్రత్యేకంగా తీర్తిదిద్దే పనికి శ్రీకారం చుట్టబోతోంది.  రాజధానిగా అమరావతి అభివృద్ధి చేస్తే... లాజిస్టిక్ హబ్‌గా మంగళగిరిని తీర్చిదిద్దనున్నారు. ఎడ్యుకేషన్ హబ్ గుంటూరు మార్చబోతున్నారు. విజయవాడను వాణిజ్య కేంద్రంగా తయారు తయారు చేయనున్నారు. ఇలా నాలుగు సిటీలతో అమరావతిని ప్రపంచంలోనే నెంబవర్ వన్‌ సిటీల జాబితాలో ఉంచబోతున్నారు. ఇప్పటికే గుంటూరు ఎడ్యుకేషన్‌కు కేంద్రబిందువుగా ఉంది. దీన్నే అవకాశంగా మార్చుకుంటున్న ప్రభుత్వం ఆధునిక ప్రపంచానికి కావాల్సిన వసతులు, విద్య కోర్సులు, ఇతర ఇనిస్టిట్యూట్‌లను అక్కడ ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ ఇప్పటికే ఆటో, వాణిజ్యం పరంగా ముందంజలో ఉంది. దీన్ని మరింతంగా తీర్చిదిద్దబోతున్నారు. అమరావతి అబివృద్ధి కోసం ప్రపంచ బ్యాంక్‌ నిధులు సాయం చేస్తోంది. త్వరలోనే ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో పడనున్నాయి. ఒక్కసారి నిధులు పడిన వెంటనే అమరావతి పనులు ఊపందుకోనున్నాయి. అమరావతితోపాటు గుంటూరు, విజయవాడ, మంగళగిరిని డెవలప్ చేయనున్నారు. ఈ నగరాల్లో ఉన్న నూజివీడు, తెనాలి, గుడివాడ లాంటి ప్రాంతాలను ప్రత్యేక కేంద్రాలుగా డెవలప్ చేయనున్నారు. ప్రత్యేక విమానాశ్రయాలు, ఇన్నర్, అవుటర్ రోడ్డులు, బైపాస్‌లు, ఏర్పాటు చేస్తారు. అసలు రాజధాని ప్రాంతానికి అన్ని ప్రాంతాల నుంచి త్వరగా చేరుకునే రవాణా వ్యవస్థలు అభివృద్ధి చేస్తారు. అమరావతి ప్రాంతంతోపాటు రాష్ట్రంలో రవాణా వ్యవస్థ మరింతగా మెరుగుపడేందుకు ఇటీవల కేంద్రం ప్రకటించిన రైల్వే వ్యవస్థ, అవుటర్ రింగ్‌రోడ్డు సహయపడబోతోంది. వీటికి తోడు సూపర్ పాస్ట్‌ కారిడార్లు కూడా నిర్మించాలని కూడా ప్రభుత్వ ఆలోచిస్తోంది. వీటితోపాటు ఈ నాలుగు నగరాల్లో లేటెస్ట్ టెక్నాలజీని విస్తృతంగా వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్‌లో ఎంత జనాభా పెరిగినా సమస్యలు రాకుండా ఉండేలా, ట్రాఫిక్ జంజాటం లేకుండా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే రోడ్లు అన్నింటినీ అనుసంధానిస్తూ పటిష్టమైన రోడ్లు వేసేందుకు డీపీఆర్ రూపకల్పనకు కన్సెల్టెన్సీలను సీఆర్‌డీఏ ఆహ్వానించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు ఆధ్యయనానికి కూడా కన్సల్టెన్సీలను పిలిచారు. ఇప్పటికే చాలా కంపెనీలు దీని కోసం పోటీ పడుతున్నాయి. సోమవారం ఈ డీపీఆర్‌ టెండర్లు పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది. ఒకసారి టెండర్లు ఖరారు అయిన తర్వాత రెండు నెలల్లో పనులు ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేయనున్నారు.

Related Posts