YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఢిల్లీలో బీజేపీ ఆపరేషన్... ఆప్ వికెట్లు డౌన్

ఢిల్లీలో బీజేపీ ఆపరేషన్... ఆప్ వికెట్లు డౌన్

న్యూఢిల్లీ, నవంబర్ 18,
ఢిల్లీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కైలాష్ గెహ్లాట్ రాజీనామా చేశారు. ఈ మరేకు పార్టీ అధినేతఅరవింద్ కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో తన రాజీనామాకు కారణాలు వివరించారు. ఇందులో కీలక ఆరోపణలు చేశారు. పార్టీ స్థాపించినప్పటి విలువలకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు చాలా వ్యత్సాసం ఉందని అభిప్రాయపడ్డారు. అందర్నీ ఏకం చేసిన విలువ నుంచి పార్టీ దూరమై సవాళ్లు ఎదుర్కొంటోందని అన్నారు. ప్రజల పట్ల పార్టీ నిబద్ధతను రాజకీయ ఆశయాలు అధిగమించాయని అన్నారు గెహ్లాట్‌. ఫలితంగా చాలా వాగ్దానాలు నెరవేరకుండా మిగిలిపోయాయని అన్నారు. యమునా నదిలో కాలుష్యం సమస్య, కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణలో అవకతవకలు, అంతర్గత విభేదాలు పార్టీని వీడటానికి కారణాలని ఆయన ప్రస్తావించారు."ఉదాహరణకు యమునా నదిని తీసుకోండి, ఇది స్వచ్ఛమైన నదిగా రూపాంతరం చెందుతుందని మేము వాగ్దానం చేసాం, కానీ ఆ పని చేయడానికి ఎప్పుడూ ముందుకు రాలేదు. ఇప్పుడు యమునా నది బహుశా గతంలో కంటే మరింత కలుషితమైంది," అని చెప్పారు, ఇప్పుడు 'షీష్మహల్' వంటి చాలా ఇబ్బందికరమైన వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పుడు మేము ఆమ్‌ ఆద్మీ పార్టీలో ఉన్నామా అనే అనుమానం చాలా మందికి కలుగుతోంది," అన్నారాయన.
"ఢిల్లీ ప్రజలకు ప్రాథమిక సేవలను అందించడంలో మా సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఢిల్లీ ప్రభుత్వం కేంద్రంతో పోరాడటానికి ఎక్కువ సమయం వెచ్చిస్తే ఢిల్లీకి నిజమైన పురోగతి జరగదని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది" అని గెహ్లాట్ లేఖలో పేర్కొన్నారు. . ఈ పరిణామంపై స్పందించిన భారతీయ జనతా పార్టీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా... గెహ్లాట్ చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. కేజ్రీవాల్‌కు గెహ్లాట్ అద్దం చూపించారన్నారు.ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరగనున్న వేళ గెహ్లాట్ రాజీనామా ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బగా భావించవచ్చు. రవాణా, పరిపాలనా సంస్కరణలు, IT, గృహం, స్త్రీ& శిశు సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో వచ్చే ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో రాజకీయ మార్పులు ప్రారంభమయ్యాయి. మొన్నీ మధ్య జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్‌ తను రాజీనామా చేసి తన  పార్టీ నేత అతిషీని ఢిల్లీ సీఎంగా కూర్చోబెట్టారు. మద్యం పాలసీలో అక్రమాల నుంచి అనేక ఆరోపణలు ఆప్‌ఆద్మీ ప్రభుత్వం మెడకు చుట్టుకుంటున్నాయి. ప్రచారంలో ఉన్న ఆరోపణలే అస్త్రంగా మలుచుకునేందుకు ప్రత్యర్థులు వ్యూహాలకు పదును పెట్టారు. కీలకమైన ఆప్‌ నేతలను తమ వైపు లాక్కునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే గెహ్లాట్‌తో రాజీనామా చేయించినట్టు స్పష్టం అవుతుంది. ఆయన రాజీనామా చేశాడో లేదే బీజేపీ కూడా ఆయనకు పాజిటివ్‌గా స్పందించింది. దీంతో ఆయన రాజీనామా వెనకాల ఉన్నది ఎవరో స్పష్టమైందని ఆప్‌ విమర్శిస్తోంది.

Related Posts