YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పవన్ సభలకు పోటెత్తున్న జనం

పవన్ సభలకు పోటెత్తున్న జనం

ముంబై, నవంబర్ 18,
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మహారాష్ట్రలో రెండు రోజుల ప్రచారానికి వెళ్లారు. తొలి రోజు మూడు సభల్లో ప్రసంగించారు. తెలుగు మూలాలున్న ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ప్రచారం ప్లాన్ చేశారు. ఆయా జిల్లాలకు ఎన్నికల ఇంచార్జులుగా తెలుగు రాష్ట్రాల నేతలనే నియమించారు. గత నెల రోజులుగా వారు అక్కడ పని చేసుకుంటున్నారు. నాందేడ్ కు విష్ణువర్ధన్ రెడ్డి.. మరఠ్వాడాకు మధుకర్ ఇంచార్జులుగా వ్యవహరిస్తున్నారు. వీరు ఇంచార్జులుగా ఉన్న చోటనే పవన్ ప్రచారం చేస్తున్నారు.ప్రచారానికి వచ్చిన పవన్ కల్యాణ్‌కు ఏపీ బీజేపీ నేతలే స్వాగతం పలికారు. ఆయన ప్రసంగాలు కొద్దిగా మరాఠీతో పాటు తెలుగులోనే సాగాయి. పవన్ ప్రసంగాలకు అక్కడి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.పవన్ కల్యాణ్ సినిమాలు మరాఠీభాషలోనూ డబ్ అవుతాయి. తెలుగు మూలాలున్న ఓటర్లు ఉండటంతో సహజంగానే పవన్ కల్యాణ్ కు ఎక్కువ క్రేజ్ ఉంది. బహిరంగసభలకు జనం పోటెత్తారు. పవన్ సభలను సక్సెస్ చేసేందుకు.. బీజేపీ అగ్రనేతల సభలకు దీటుగా జన సమీకరణ చేశారు. పవన్ కల్యాణ్ ప్రసంగం వారిలో జోష్ నింపింది. మహారాష్ట్ర ప్రజలను తాను ఓటు అడగడానికి రాలేదని వారికి గౌరవం ఇవ్వడానికి వచ్చానని చెప్పి ఆకట్టుకున్నారు. మహారాష్ట్రలో ఉన్న జాతీయవాదానికి అనుగుణంగా పవన్ కల్యాణ్ ప్రసంగాలు సాగాయి. పవన్ కల్యాణ్ మరో రోజు కూడా మహారాష్ట్రలో ప్రచారం చేస్తారు. పవన్ కల్యాణ్‌కు స్టార్ గా ఉన్న ఆదరణతో పాటు ఆయన సనాతన ధర్మం కోసం ఇటీవల చేసిన ఉద్యమానికి కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా లభించింది. మహారాష్ట్రలో పోలింగ్ ఇరవయ్యో తేదీన జరగనుంది.    

Related Posts