YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరత పరిచే కుట్ర నడుస్తోంది

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరత పరిచే కుట్ర నడుస్తోంది

హైదరాబాద్
కాంగ్రెస్ నేతలు డాక్టర్ రాంచందర్ నాయక్, బలరాం నాయక్, బాలు నాయక్ సోమవారం నాడు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ ను కలిసారు. లగచర్లలో గిరిజన ప్రజలపై జరిగిన ఘటనపై  వినతి పత్రం ఇచ్చి, వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాంచందర్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని అస్ధిరత పరిచే కుట్ర చేస్తున్నారు. బిఆర్ఎస్ దుష్ట పాలనలో వేములఘాట్లో రైతు ఆత్మార్పణ, రైతులకు సంకెళ్లు.దళితులను ట్రాక్టర్తో తొక్కించిన ఘటనలు  మరిచారా? రైతుల సమస్యలు వినడానికి, పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.రాష్ట్ర ప్రభుత్వాన్ని,పరిపాలనను అస్ధిరత పరచాలన్న కుట్ర జరుగుతోందని,అధికారం కోల్పోయామన్న అక్కసుతో అమాయకులైన రైతులను రెచ్చగొట్టి  పబ్బం గడుపుకోవాలని బి ఆర్ ఎస్ ప్రయత్నిస్తోందని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ గారికి తెలిపారు .చిల్లర, అవకాశవాద,కుట్రపూరిత రాజకీయాలతో మనుగడ సాగించలేరనే విషయాన్ని బిఆర్ఎస్ గుర్తించాలని హితవు పలికారు.పార్టీ ఉనికి  కోసం అమాయక రైతులను బలిపెట్టవద్దని ఆ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేశారు.లగచర్లలో ప్రజలు,అక్కడి రైతుల సమస్యలు తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్తో సహా అధికారులు  వెళ్లినపుడు,ఎలాంటి చర్చకు ఆస్కారం ఇవ్వకుండానే దాడికి పాల్పడడం నీచం,అత్యంత హేయమైన చర్య.జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారంటే దానివెనుక భారీ కుట్ర కోణం దాగి ఉందని  అర్ధమవుతుంది.రైతులు తమ సమస్యలను చెప్పుకోవడానికి ,స్ధానికుల సమస్యలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఈలాంటి కుట్రపూరితచర్యలకు పాల్పడడం దురదృష్టకరం.రైతులను నష్టపెట్టాలన్నది ఈ ప్రభుత్వ ఉద్దేశం కాదు,వారి సమస్యలను  వినడానికి,పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది.ప్రజాస్వామ్య యుతంగా వెళ్తుంది.రైతుల ముసుగులో అధికారులను చంపే ప్రయత్నం చేయడం  మంచిపద్దతి కాదు.సంఘటను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందని అన్నారు.

Related Posts