కూటమి ప్రభుత్వం లో శాంతి భద్రతలు క్షీనించాయని అదే ప్రభుత్వం లోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసినా..అక్కడక్కడా కొన్ని జిల్లాల్లో టిడిపి, జన సేన శ్రేణులు మధ్య అంతర్గత కుమ్ములాటలు సాగుతున్నా...వంటి ఘటనలపై టిడిపి శ్రేణుల్లో కొంతకాలంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కారణాలు ఏవైనా.. నాయకులు మాత్రం నిప్పులు చెరుక్కుంటు న్నారు. కూటమి నేతలు తమ పదవులు తన్నుకు పోతున్నారని టీడీపీ నాయకులు, టీడీపీ నాయకుల వల్లే తమకు పదవులు రాకుండా ఉంటున్నాయని ఇతర పార్టీల నాయకులు ఉసూరు మంటున్నారు. దీంతో కలివిడి కన్నా విడివిడి రాజకీయాలే ఏపీలో క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి.
ఇలాంటి సమయంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు పదే పదే చెబుతున్నారు. అయినప్పటికీ.. కొందరు తమ్ముళ్లు మాత్రం ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి సమయంలోనే చంద్రబాబు జాతీయ వేదికగా.. బీజేపీ+టీడీపీ+జనసేన కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎలాంటి పనులు చేసినా.. తాము మాత్రం కలిసే ముందుకు సాగుతామన్నారు.