విజయవాడ, నవంబర్ 19,
పవర్‌లోకి రాగానే కొడాలి నానిని టార్గెట్ చేసింది కూటమి సర్కార్. విచారణలు, గుడివాడలో అక్రమాలు అంటూ కేసుల వరకు వెళ్లింది వ్యవహారం. అక్కడక్కడ నాని మీద FIRలు కూడా అయ్యాయి. ఏ క్షణంలో అయినా కొడాలి నానిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కారణాలేంటో తెలియదు కానీ..టీడీపీ క్యాడర్, లీడర్ల నుంచి వస్తున్న ఒత్తిడికి అనుగుణంగా నాని మీద వేగంగా యాక్షన్ తీసుకోలేకపోయింది కూటమి సర్కార్. ఇప్పుడు ఆయన చుట్టూ ఉచ్చు బిగించే ప్లాన్ జరుగుతోంది.కొడాలి నాని..మీడియా ముందుకు వస్తే చాలు..చంద్రబాబు, లోకేశ్ పేరెత్తితే ఒంటి కాలిపై లేచేవారు. ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యేవారు. ఇంకో రకంగా చెప్పాలంటే అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడటమే స్టైల్‌గా పెట్టుకున్నారనొచ్చు. వైసీపీ హయాంలో సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్న నానికి..అప్పుడే బూతు శాఖ మంత్రి అని పేరు పెట్టింది టీడీపీ.వైసీపీ ఓడిపోయి, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కొడాలి అడ్రెస్స్ లేకుండా పోయారు. ఆ మధ్య ఓసారి మీడియా ముందుకు వచ్చి కనబడిన నాని..తర్వాత తెరమీద కనిపించడం లేదు. అయితే చంద్రబాబు, లోకేశ్‌తో పాటు వారి కుటుంబసభ్యుల మీద నాని మాట్లాడిన తీరుపై రగిలిపోతోంది టీడీపీ క్యాడర్. నాని మీద సీరియస్ యాక్షనే తీసుకోవాలని కూటమి పెద్దల మీద తీవ్రంగా ప్రెజర్ ఉంది. లేటెస్ట్‌గా విశాఖలో నమోదైన కేసుతో అసలు ఎపిసోడ్ స్టార్ట్ అయినట్లే కనిపిస్తోంది.మహిళల మీద కామెంట్స్, పోస్టులు పెట్టారంటూ ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లకు చుక్కలు చూపిస్తోంది కూటమి ప్రభుత్వం. ఫ్యాన్ పార్టీకి మద్దతుగా ఉంటూ.. కూటమి నేతలు, వారి కుటుంబసభ్యుల మీద దారుణంగా మాట్లాడిన వారిని కేసులు వెంటాడుతున్నాయి. డైరెక్టర్ ఆర్జీవీకి నోటీసులు అందాయి. తనపై నమోదైన కేసును కొట్టేయాలని ఆయన వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఇక ఆయన విచారణ ఎదుర్కోక తప్పని పరిస్థితి. పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్‌ను కేసులు వెంటాడుతున్నాయ్. తనను వదిలేయాలంటూ శ్రీరెడ్డి వీడియో రిలీజ్ చేసినా..ఆమె మీద పోలీసులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి.కూటమి సర్కార్ ప్లాన్‌లో భాగంగానే..ఇప్పటివరకు వైసీపీ సానుభూతిపరుల పని ఖతం పట్టించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు జగన్ మెయిన్ కోటరీని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఓ యువతి ఫిర్యాదు చేయడం ఓ సాధారణ వార్తలాగే అనిపిస్తున్నా..కూటమి సర్కార్ యాక్షన్ సిరీస్ పార్ట్-2 స్టార్ట్ అయినట్లే కనిపిస్తోంది.ఇప్పటివరకు సోషల్ మీడియా పోస్టులు, అసభ్యకర పోస్టులపై నమోదవుతోన్న కేసులను బట్టి చూస్తే.. త్వరలోనే కొడాలి నానిపై కూడా మరికొన్ని జిల్లాల్లో ఫిర్యాదులు, ఎఫ్‌ఐఆర్‌లు ఎపిసోడ్‌లాగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అలా వరుస పెట్టి కేసుల్లో ఇరికించి..విచారణలు, కేసులు..అరెస్ట్ వరకు వ్యవహారం వెళ్తుందని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కూటమి సర్కార్ యాక్షన్ సిరీస్ పార్ట్-2లో మాజీమంత్రులు, కొందరు నేతల ఉన్నట్లు తెలుస్తోంది. కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆర్కే రోజా, అనిల్‌కుమార్ యాదవ్, పేర్నినాని, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు ఇలా పెద్ద నేతలే టార్గెట్‌గా పార్ట్-2 యాక్షన్ సిరీస్ స్టార్ట్ చేసిందట కూటమి సర్కార్.ఇప్పటికే పలువురు వైసీపీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కేసులు ఫేస్ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు కేసు పెట్టి విచారించారు. అంతకుముందు మాజీమంత్రి మేరుగ నాగార్జున, యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పైనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల ఎపిసోడ్‌కు ఇప్పట్లో బ్రేకులు పడేలా కనిపించట్లేదు. దాంతో నెక్స్ట్ ఎవరు టార్గెట్ అవుతారోనని వైసీపీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది.