YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆర్మీ వ్యక్తికి పునర్జన్మ ఇచ్చిన భువనేశ్వర్ డాక్టర్లు

ఆర్మీ వ్యక్తికి  పునర్జన్మ ఇచ్చిన భువనేశ్వర్ డాక్టర్లు

భువనేశ్వర్, నవంబర్ 19,
మనిషి అన్ని సృష్టిస్తున్నాడు. మనిషిని పోలిన మరమనిషిని తయారు చేశాడు, ఆ మర మనిషికి ఆలోచించే శక్తిని ఇచ్చాడు. పోయినా ప్రాణాన్ని తిరిగి తెచ్చే అంశం తప్ప మిగతా అన్ని సాకారమవుతున్నాయి. అయితే తాజాగా భువనేశ్వర్‌లో పోయిన ప్రాణాన్ని తిరిగి నెలబెట్టిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 90 నిమిషాల పాటు ఆగిపోయిన గుండెను తిరిగి పునరుద్ధరించారు భువనేశ్వర్‌ ఎయిమ్స్‌ వైద్యులు. శుభాకాంత్ సాహు అనే 24 ఏళ్ల ఆర్మీకి చెందిన యువకుడు గత నెల 1వ తేదీన అనారోగ్య సమస్యలతో భువనేశ్వర్‌లోని ఎయిల్స్‌లో అడ్మిట్‌ అయ్యాడు. ఆసుపత్రికి చేరుకున్న కొద్ద సేపటికీ ఆయన గుండె పనిచేయడం ఆగిపోయింది. దీంతో వెంటనే అలర్ట్‌ అయిన వైద్యులు సీపీఆర్‌ను నిర్వహించారు. ఏకంగా 40 నిమిషాల పాటు సీపీఆర్‌ నిర్వహించినా ఎలాంటి ఫలితం లభించలేదు. శుభాకాంత్‌కు ఎక్స్‌ట్రాకార్పోరియల్‌ కార్డియో-పల్మనరీ రిససిటేషన్‌ (ఈసీపీఆర్‌) అనే ప్రత్యేకతమైన వైద్య విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. పలు చర్చల తర్వాత డాక్టర్‌ శ్రీకాంత్‌ బెహరా నేతృత్వంలోని బృందం ఎక్స్‌ట్రాకార్పోరియల్‌ మెంబ్రేన్‌ ఆక్సిజనేషన్‌ (ఎక్మో)తో చికిత్స ప్రారంభించింది. ఇలా 90 నిమిషాల ప్రయత్నం తర్వాత గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభమైంది. ఒకరకంగా చెప్పాలంటే శుభాకాంత్‌కు వైద్యులు పునర్జన్మ ఇచ్చారని చెప్పాలి.వెంటనే గుండెకొట్టుకునే తీరు సరిగ్గా లేదు. 30 గంటల తర్వాత గుండె పనితీరు మెరుగైంది. 96 గంటల తర్వాత ఎక్మోను తొలగించారు. ఎక్మో విషయానికొస్తే.. గుండె, ఊపిరితిత్తుల పనితీరును వేరువేరుగా నిర్వర్తించేందుకు ఈ విధానాన్ని ఉపయోగిస్తారు. అయితే ఈ విధానం ఎన్నో సవాళ్లతో కూడుకుందని వైద్యులను చెబుతున్నారు. ప్రస్తుతం శుభాకాంత్ పూర్తిగా కోలుకున్నారని వైద్యులు తెలిపారు.

Related Posts