YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ వెనక్కి వెళుతున్న సముద్రం...

మళ్లీ వెనక్కి వెళుతున్న సముద్రం...

విశాఖపట్టణం, నవంబర్ 19,
విశాఖ తీరంలో సముద్రం సయ్యాట ఆడుతోంది. అలలతో ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఉండే సముద్రం ఉన్నట్లుండి 200 మీటర్లు వెనక్కి వెళ్లింది. నిత్యం అలలు ఎగసిపడి బీచ్‌ రోడ్డును తాకేవి. అలాంటిది అలల తాకిడి లేకపోగా సముద్రం వెనక్కి వెళ్లిపోవడంతో స్థానికులు ఆశ్చర్యంతో పాటు భయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు సముద్రంలో ఇసుక కోత కూడా ఓ కారణమంటున్నారు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ చీఫ్ సైంటిస్ట్ VVSS శర్మ. అయితే సముద్రంలో ఇలా మార్పులు వచ్చినప్పుడు సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.విశాఖ బీచ్‌లో మారుతున్న కెరటాల ఆటుపోట్లతో, సాధారణ సమయంలో కనిపించని దృశ్యాలు కనిపిస్తున్నాయి. సముద్రం వెనక్కి వెళ్లిపోవడంతో తీరంలో రాళ్లు తేలి కనిపిస్తున్నాయి. కార్తీక పౌర్ణమి తర్వాత మళ్లీ కెరటాలు వెనక్కి వెళ్ళినట్టు కనిపించాయి. ఆ తర్వాత రోజు కూడా అటువంటి దృశ్యాలే కనిపించాయి. ఇవి పర్యాటకులను తెగ ఆకర్షిస్తున్నాయి. బీచ్‌కు వచ్చిన టూరిస్టులు, సరదాగా ఫొటోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. గతంలోనూ ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ.. వెనక్కు వెళ్లిన సముద్రం మళ్ళీ సాధారణంగా మారింది. పున్నమికి, అమావాస్యకు ఇలా జరగడం సహజమే అంటున్నారు స్థానిక మత్స్యకారులు.

Related Posts