వికారాబాద్
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల కేసు కు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి... దాడిలో పాలుపంచుకున్నాడని కారణంతో ఓ పంచాయతీ కార్యదర్శిని అరెస్టు చేయగా.... లగచర్లలో శాంతిభద్రతలు అదుపుతప్పవాని భావించి పరిగి డిఎస్పీ కరుణాసాగర్ ను బాద్యుని చేస్తూ డిజిపి ఆఫీస్ కు అటాచ్ చేసారు.. దాడి సంఘటనలో రైతులతో పాటు పంచాయతీ సెక్రెటరీ కావలి రాఘవేందర్ పాలుపంచుకున్నాడని కారణంతో పోలీసులు ఏ 26 గా చేర్చడంతో అతన్ని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తరులు జారీ చేశారు.. అదనపు డీజీపీ మహేష్ భగవత్ సంఘటన స్థలానికి చేరుకుని రెండు విడతలుగా వివరాలు సేకరించి శాంతి భద్రతలు అదుపు తప్పవని కారణంతో డిఎస్పి పై వేటు వేశారు. లగచర్ల ఘటనలో 47 మంది నిందితులకు గుర్తించిన పోలీసులు ఇప్పటికే సగం మందికి పైగా అరెస్టులు చేశారు.... కేసు లో కీలక నిందితుడుగా ఉన్న సురేష్ ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు.....