YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేటీఆర్ అరెస్ట్ పై యూ టర్నేనా

కేటీఆర్ అరెస్ట్ పై యూ టర్నేనా

హైదరాబాద్, నవంబర్ 19,
దీపావళి బాంబులు అన్నారు. ఏ టైమ్‌లో ఏదైనా జరగొచ్చు అన్నారు. కేటీఆర్‌ అరెస్ట్ ఖాయమన్నారు. ఓ నాలుగు రోజుల హడావుడితో..తెలంగాణ పొలిటికల్‌ మూడ్‌నే మార్చేశారు కాంగ్రెస్ నేతలు. సీన్‌ కట్‌ చేస్తే కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.ప్రభుత్వాన్ని నిత్యం ఏదో ఒక ఇష్యూతో ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్న..కేటీఆర్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపాలని కాంగ్రెస్‌లో ఒక వర్గం నేత‌లు బ‌లంగా డిసైడ్ అయ్యారట. గత సర్కార్‌ హయాంలో కేటీఆర్ నిర్వహించిన మంత్రిత్వ శాఖల్లో అక్రమాలపై ఆయనను అరెస్ట్ చేస్తే అంతా సైలెంట్‌ అయిపోతారని భావించారట. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేతలే డైలమాలో పడ్డారట.బీఆర్ఎస్ ప్రభుత్వ స్కీముల్లో స్కామ్‌లు జ‌రిగాయ‌ని అప్పట్లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమ‌ర్శలు చేసింది. కానీ ప్రభుత్వంలోకి వ‌చ్చి ఏడాది అవుతున్నా ఇప్పటివ‌ర‌కు ఏ విష‌యంలో కేసీఆర్ ఫ్యామిలీని ఫిక్స్ చేయ‌లేక‌పోయామ‌ని కాంగ్రెస్ అంత‌ర్గత స‌మావేశాల్లో చ‌ర్చ జ‌రిగిందట. ఏదో ఒకదాంట్లో కార్నర్ చేసి జైలుకు పంపాల్సిందేన‌ని పార్టీలో కొంద‌రు నేత‌లు పట్టుబడుతున్నారట.ఫార్ములా ఈ రేస్ నిధుల విడుదల నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా జ‌రిగిందని.. కేటీఆర్‌ అడ్డంగా బుక్కయ్యారని అరెస్ట్ చేయాలని పార్టీ నేతల నుంచి డిమాండ్ వచ్చింది. ఇదే విషయంలో కొందరు కాంగ్రెస్ నేతలు లీకులు కూడా ఇచ్చారు.
కేటీఆర్‌ను అరెస్ట్ చేయ‌డం కోసం గ‌వ‌ర్నర్ అనుమ‌తి కోరుతూ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ విష‌యం ఎటూ తేల‌కముందే మ‌రో అంశం తెర‌పైకి వ‌చ్చింది. అదే ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌.సీఎం రేవంత్ రెడ్డి సొంత కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఫార్మాసిటీ కోసం భూసేకరణపై లగ‌చ‌ర్ల పెద్దదుమారం లేచింది. ల‌గ‌చ‌ర్లలో క‌లెక్టర్‌తో పాటు అధికారుల‌పై రైతులు తిర‌గ‌బ‌డ్డారు. ఇదంతా జ‌ర‌గ‌డానికి బీఆర్‌ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కార‌ణ‌మ‌ని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.దాడికి సూత్రధారిగా భావిస్తున్న సురేష్ అనే వ్యక్తి.. మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డికి ప‌లుమార్లు కాల్స్ చేశారని..స్వయంగా కేటీఆర్‌తో మాట్లాడార‌ని..ఆ త‌ర్వాతే దాడి జ‌రిగింద‌ని అంటోంది కాంగ్రెస్. ఆరోపణలకు బ‌లం చేకూరేలా పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో కేటీఆర్ పేరు ప్రస్తావించడం పొలిటిక‌ల్‌గా మ‌రింత హీట్ పెంచుతోంది. ఈ విషయంలో కేటీఆర్‌ను అరెస్ట్ చేయాల‌నే డిమాండ్ కూడా కాంగ్రెస్‌లో బ‌లంగా వినిపించింది. కొంద‌రు నేత‌లు కేటీఆర్‌ను అరెస్ట్ చేయాల‌ంటూ ఓపెన్‌గానే కామెంట్స్ చేశారు.ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌లో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే జ‌రిగే ప‌రిణామాల‌పై కాంగ్రెస్ లోతుగా ఆలోచ‌న చేసింద‌ట‌. ల‌గ‌చ‌ర్ల అంశం రైతుల‌తో ముడిప‌డి ఉండ‌టం..అరెస్ట్ అయినవారంతా ఎస్టీ లంబ‌డా సామాజిక‌వ‌ర్గానికి చెందినవారు కావ‌డంతో కాంగ్రెస్ పునరాలోచ‌న‌లో ప‌డినట్లు తెలుస్తోంది.ఈ ఘ‌ట‌న‌లో కేటీఆర్‌ను కార్నర్ చేసి అరెస్ట్ చేస్తే రాజ‌కీయంగా కాంగ్రెస్‌కు మ‌రింత న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని భావిస్తోంద‌ట‌. రైతులు.. అందులోనూ లంబాడ సామాజిక‌వ‌ర్గంలో కేటీఆర్‌కు, బీఆర్ఎస్‌కు సానుభూతి పెరిగే ఛాన్స్ ఉంద‌ని ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌. అందుకే ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌నలో కేటీఆర్ అరెస్ట్‌పై హస్తం పార్టీ సైలెంట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.ఏదో ఒక ఇష్యూలో కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నేత‌లు బ‌లంగా ఫిక్స్ అయిపోయారట. లగచర్ల ఘటన..రైతులు, ఎస్టీలతో ముడిపడి ఉండటంతో కాస్త వెనక్కి తగ్గినా కేటీఆర్‌ను జైలుకు పంపడం మాత్రం ఖాయమంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఫార్ములా ఈ రేస్‌ కేసులో గవర్నర్ అనుమతి రాగానే..కేటీఆర్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు పంపిస్తారట.అయితే ఫార్ములా ఈ రేస్‌ అయినా..లగచర్ల ఘటనా అయినా అరెస్ట్ చేస్తే చేసుకోండి..తగ్గేదేలే అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇలా కేటీఆర్ అరెస్ట్‌ ఇష్యూ హాట్‌ టాపిక్‌గా ఉండి చల్లబడిపోతుందా..లేక అరెస్ట్‌ వరకు వ్యవహారం వెళ్తుందా అనేది మాత్రం సస్పెన్స్‌గానే మారింది.

Related Posts