హైదరాబాద్
తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి డిల్లీలో తీవ్ర కాలుష్యంతో పాఠశాలలు బంద్ చేసే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ తెలంగాణలో అలాంటి పరిస్థితి రావద్దని ఈవి పాలసీ తెచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ఎలక్ట్రిక్ వాహనాలను విసృతంగా ప్రజలు వాడేలా ఈ పాలసీ ఉంది. ఈవి వాహనాల పై రోడ్డు టాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు 100 శాతం మినహాయింపు ఇస్తున్నాం. ఇప్పటికే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చాం. కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రజలు 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్వచ్చందంగా స్క్రాప్ చెపించాలి. హైబ్రిడ్ వాహనాల పై కూడా పన్ను రాయితీ పై ఆలోచిస్తున్నాం. ప్రజలు ఈవి వాహనాలు కొనండని అన్నారు. రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఆదేశాలు కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలపై కఠినంగా వ్యవహరించాలని అన్నారు. ..