YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆర్బిఐ గ‌వ‌ర్నర్ శ‌క్తికాంత దాస్ పదవీకాలం పొడిగింపు ?

ఆర్బిఐ గ‌వ‌ర్నర్  శ‌క్తికాంత దాస్ పదవీకాలం పొడిగింపు ?

న్యూ డిల్లీ నవంబర్ 19
భార‌తీయ రిజ‌ర్వు బ్యాంక్ గ‌వ‌ర్నర్  శ‌క్తికాంత దాస్   పదవీకాలాన్ని కేంద్ర మరోసారి పొడిగించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలిసింది. ఆయన ప్రస్తుత పదవీ కాలం వచ్చే నెల డిసెంబర్‌ 10తో ముగియనుంది. ఈ స్థానం కోసం ఇతర అభ్యర్థులను ఎవరినీ ఇప్పటి వరకూ ఎంపిక చేయలేదని తెలిసింది. దీంతో ఆయన పదవీకాలం రెండోసారి పొడిగించే అవకాశం ఉన్నట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్‌ నివేదించింది. మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత పొడిగింపును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.కాగా, 1980వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శ‌క్తికాంత దాస్‌.. 2018 డిసెంబ‌ర్ 12న ఆర్బీఐ గ‌వ‌ర్నర్‌గా బాధ్యత‌లు స్వీకరించారు. అప్పటి వ‌ర‌కు ఆర్బీఐ గ‌వ‌ర్నర్‌గా ఉర్జిత్ ప‌టేల్ త‌న ప‌ద‌వీ కాలానికి ముందే రాజీనామా చేయ‌డంతో ఆయ‌న స్థానంలో కేంద్రం శ‌క్తికాంత దాస్‌ను నియ‌మించింది. అప్పటి నుంచి అదే పదవిలో కొనసాగుతున్నారు. 2021 డిసెంబర్‌ 10కి ఆయన మూడేళ్ల పదవీ కాలం ముగియడంతో.. కేంద్రం మరోసారి ఆయనకే పట్టం కట్టింది. శ‌క్తికాంత దాస్ ప‌ట్ల కేంద్ర ప్రభుత్వం విశ్వాసం ప్రక‌టించింది. మ‌రో మూడేండ్ల పాటు ఆయ‌న ఆ ప‌ద‌వీకాలం పొడిగించారు. ఈ ప్రకారం వచ్చే నెల డిసెంబర్‌తో ఆయన పదవీ కాలం ముగుస్తుంది. అయితే, మరోసారి ఆయన్ని ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఐదేళ్ల కంటే ఎక్కువకాలం ఆర్బీఐ గవర్నర్‌గా దాస్ ఉన్నారు. మరోసారి ఆయన పదవీకాలం పొడిగిస్తే.. బెనగల్ రామారావు   తర్వాత అత్యధిక కాలం ఆర్బీఐ గవర్నర్‌గా చేసిన వ్యక్తిగా దాస్‌ నిలవనున్నారు. రామారావు 1949-1957 మధ్య ఏడున్నర సంవత్సరాల పాటు ఆర్బీఐ చీఫ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటివరకు ఆయనే అత్యధిక కాలం ఆ పదవిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన తర్వాత అత్యధిక కాలం ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన వ్యక్తిగా దాస్‌ నిలవనున్నారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.1980వ బ్యాచ్ త‌మిళనాడు క్యాడ‌ర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి శ‌క్తికాంత దాస్‌.. 2017 వ‌ర‌కు కేంద్ర ఆర్థిక వ్యవ‌హారాల‌శాఖ కార్యద‌ర్శిగా ప‌ని చేశారు. 2016లో నోట్ల ర‌ద్దు టైంలో కేంద్రంలో కీల‌క పాత్ర పోషించారు. ఆయ‌న ఆర్థిక‌శాఖ‌లో ప‌ని చేస్తున్నప్పుడు 8 బ‌డ్జెట్ల రూప‌క‌ల్పన‌లో భాగ‌స్వామి అయ్యారు. ఆర్థికం, ప‌న్నులు, ప‌రిశ్రమ‌లు, మౌలిక వ‌స‌తుల క‌ల్పన కోసం కీల‌క నిర్ణయాలు తీసుకున్నారు. 38 ఏండ్ల కెరీర్‌లో శ‌క్తికాంత దాస్ వివిధ బాధ్యత‌లు నిర్వర్తించారు.

Related Posts