బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా తన తాజా అమెరికన్ టీవీ సిరీస్ ఎపిసోడ్ ‘క్వాంటికో’కు సంబంధించి అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఈ కార్యక్రమంలో భారతీయులను టెర్రరిస్టులుగా చూపించగా, దానిపై విమర్శలు వచ్చాయి. దీంతో ట్విట్టర్ లో ఆమె స్పందించారు. భారత ప్రజల మనోభావాలను గాయపరచాలన్న ఉద్దేశం తనకు ఏ కోశాన లేదన్నారు. భారతీయురాలిగా తాను గర్విస్తున్నానని చెప్పారు.
I’m extremely saddened and sorry that some sentiments have been hurt by a recent episode of Quantico. That was not and would never be my intention. I sincerely apologise. I'm a proud Indian and that will never change.
— PRIYANKA (@priyankachopra) 9 June 2018