YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్‌-20

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన  జీశాట్‌-20

న్యూఢిల్లీ నవంబర్ 19
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) రూపొందించిన అత్యాధునిక సమాచార ఉపగ్రహం జీశాట్‌-20 (GSAT 20) విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికా ఫోరిడాలోని కేప్‌ కెనవెరాల్‌ ప్రయోగ కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. 34 నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. కొద్ది రోజుల్లో కర్ణాటలోని హసన్‌లో ఉన్న ఇస్రో మాస్టర్‌ కంట్రోల్‌ ఫెసిలిటీ సెంటర్‌ ఈ ఉపగ్రహాన్ని నియంత్రణలోకి తీసుకుంటుంది.వాణిజ్య పరంగా స్పేస్‌ఎక్స్‌, ఇస్రో మధ్య ఇదే తొలి ప్రయోగం కావడం విశేషం. 4,700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని ఇస్రో వద్ద ఉన్న రాకెట్లు తీసుకెళ్లేందుకు సాధ్యం కాకపోవడంతో టెస్లా సీఈవో ఎలాన్‌ మాస్క్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ సహకారం తీసుకున్నది. ఇది 14 ఏండ్లపాటు సేవలు అందించనుంది. అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌తో పాటు భారత్‌ మొత్తాన్ని కవర్‌ చేసి బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందిస్తుంది. అదేవిధంగా విమానాల్లో వై-ఫై సేవలు మరింత విస్తృతం కానున్నాయి. ఆధునిక కా బ్యాండ్ ఫ్రీక్వెన్సీని మాత్రమే ఉపయోగించే ఉపగ్రహాన్ని ఇస్రో రూపొందించడం ఇదే మొదటిసారి.కాగా, జీశాట్‌-20 ఉపగ్రహం 14 ఏండ్ల పాటు సేవలు అందించనుందని, భూకేంద్రంలోని మౌలికసౌకర్యాలు శాటిలైట్‌‌తో అనుసంధానం కానుందని ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌ అన్నారు. బెంగళూరులోని యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ నుంచి ప్రయోగాన్ని ఆయన పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. కచ్చితమైన కక్ష్యలోకి ఉపగ్రహం చేరడంతో ప్రయోగం విజయవంతమైంది. ఉపగ్రహంలో ఎటువంటి సమస్యలు లేవు.. సోలార్ ప్యానెల్లు అమర్చామని చెప్పారు

Related Posts