YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఛలో ఢిల్లీ విజయవంతం చేయాలి

ఛలో ఢిల్లీ విజయవంతం చేయాలి

హైదరాబాద్
చలో ఢిల్లీ బహిరంగ సభ విజయవంతం చేయాలని, మనువాదుల నుండి రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరం  ఎంతైనా ఉందని, మోడీ రాక్షస పాలనలో దేశవ్యాప్తంగా దళితులపై దాడులు అహరికట్టలని టిపిసిసి ఎస్,సి డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంఛార్జి తిప్పారపు సంపత్  కోరారు. హైదరాబాద్, బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో చలో ఢిల్లీ వాల్ పోస్టర్ ను తన అనుచరులతో విడుదల చేసిన టిపిసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీస్ రాష్ట్ర ఇంఛార్జి తిప్పారపు సంపత్ మాట్లాడుతూ... తెలంగాణ వ్యాప్తంగా టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ చైర్మన్ ప్రీతం నాయకత్వంలో చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని నవంబర్ 26వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని చల్లో ఢిల్లీ తల్కాతొర స్టేడియంలో జాతీయ కాంగ్రెస్ ఎస్పీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా రాహుల్ గాంధీ, మల్లికార్జున కార్లే, కొప్పుల రాజు, రాజేష్ లిలోతియా, ముఖ్య నాయకులు పాల్గొంటారణి తెలిపారు.  తెలంగాణ వ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రజలు తరలిరావాలని పిలుపునిస్తూ.. దేశవ్యాప్తంగా గత 10 సంవత్సరాల నుండి మోడి పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల, మీద అనేక దాడులు మతతత్వ వాదులు చేస్తుంటే మోడీ ప్రభుత్వం వారిని కాపాడుతూ వస్తుందని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని విచ్చిన్నం చేయాలని కుట్రతో ప్రజాస్వామ్యవాదుల పై కేసులు పెట్టి అనేక మందిని జైలుకు పంపించడం జరిగిందని, మోడీ ఏ రాజ్యాంగం ద్వారా నైతే ప్రధానమంత్రి అయ్యారో అదే రాజ్యాంగాన్ని నీరుగార్చాలని చూస్తున్నారని అన్నారు. బిజెపి పాలిత ప్రాంతాల్లో దళితులపై రోజు రోజుకు దాడులు పెరిగిపోవడమే కాకా ప్రశ్నించిన దళితులపై హీనంగా నగ్నంగా,ఎంతోమందిపై దాడులు చేస్తూ,హత్య చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మోడీ ప్రభుత్వం నేరస్తులకే వత్తాసు పలుకుతు.. రాజ్యాంగాన్ని ఎత్తివేయాలని బిజెపి ప్రభుత్వం నాయకత్వంలో అనేక కుట్రలు చేస్తున్నారని, దీన్ని ప్రజలు ఇప్పటికే పసిగట్టారని దేశవ్యాప్తంగా ప్రజలంతా ఒక తాటిపైకి వచ్చి మోడీపై ఉద్యమం చేయకుంటే రానున్న రోజుల్లో పూర్తిగా స్వేచ్ఛను కోల్పోయే ప్రమాదం ఉందని, ఆడవాళ్లు రోడ్డు మీద తిరుగలేని ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయని ,ప్రజలంతా చైతన్యవంతులై మోడీ ప్రభుత్వం పై దేశవ్యాప్తంగా పోరాటాలు చేయాలని పిలుపునిస్తున్నాము అని చెప్పారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ జీడి రవితేజ,శ్రీనివాస్,సంపత్,నరసింహ,ప్రశాంత్,రాజేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts