YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో దారుణం,,,

విశాఖలో దారుణం,,,

విశాఖపట్టణం, నపంబర్ 20,
ఏపీలో ఆడపిల్లల ఘోరాలు ఆగడంలేదు. నిత్యం ఏదోకచోట మృగాళ్లు ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా విశాఖలో మరో దారుణం వెలుగుచూసింది. లా విద్యార్థినిపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసి ఆ వీడియోలను తమ సెల్‌ఫోన్లలో రికార్డు చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ వీడియోలు అడ్డం పెట్టుకుని పలుమార్లు లా విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టారు. విద్యార్థిని పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగు చూసింది. బాధితురాలి విశాఖ మధురవాడలోని ఓ లా కాలేజీలో లా మూడో సంవత్సరం చేస్తుంది. విద్యార్థిని తన సహచర విద్యార్థి వంశీతో స్నేహం చేసింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. విద్యార్థినిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వంశీ, ఈ ఏడాది ఆగస్టు 10న కంబాలకొండకు తీసుకెళ్లాడు. అక్కడ విద్యార్థినిపై వంశీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విద్యార్థినిని ఆగస్టు 13న డాబాగార్డెన్ లోని తన స్నేహితుడు ఆనంద్‌ ఇంటికి తీసుకెళ్లిన వంశీ.. మరోమారు అత్యాచారం చేశాడు. అనంతరం వంశీ స్నేహితులు ఆనంద్‌, రాజేష్‌, జగదీష్‌ కూడా యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. యువతి నగ్నంగా ఉన్న వీడియోలు తీసి బెదిరిస్తూ పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత వంశీ స్నేహితులు ఆనంద్‌, రాజేష్‌, జగదీష్‌ యువతికి ఫోన్‌ చేసి తమ కోరిక తీర్చాలని లేకపోతే వీడియోలు బయటపెడతామని బెదిరించారు. ఈ విషయాన్ని యువతి వంశీ దృష్టికి తీసుకెళ్లగా...తన స్నేహితుల కోరిక తీర్చాలని ఆమె వేధించాడు. నలుగురి నుంచి రోజురోజుకీ వేధింపులు పెరగడంతో ఈ నెల 18న ఉరివేసుకుని ఆత్మాహత్యాయత్నం చేసింది బాధితురాలు. యువతిని గమనించిన ఆమె తండ్రి కాపాడి అసలేం జరిగిందని నిలదీయడంతో నిర్ఘాంతపోయే విషయాలు యువతి తండ్రికి చెప్పింది. దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. కానీ.. కూతురి ఆత్మహత్యాప్రయత్నాన్ని అడ్డుకున్న తండ్రి.. ఆమె వేదన వెనకున్న కారణాలపై ఆరా తీశాడు. దాంతో.. జరిగిందంతా చెప్పి కన్నీరుమున్నీరుగా విలపించింది బాధితురాలు. అయితే.. ఇలాంటి పరిస్థితులు.. ఇలాంటి అన్యాయం మరొకరికి జరగకూడదనే ఆలోచనతో విశాఖ పోలీసులను ఆశ్రయించారు బాధితురాలి కుటుంబసభ్యులు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. నిందితుల్లో ముగ్గురు యువతి క్లాస్‌మేట్స్‌ ఉన్నారు.. అయితే.. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువతితో నేరస్థులు నలుగురు దారుణంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.. బాధిత యువతి న్యాయ విద్యను అభ్యసిస్తోంది..ఇక.. ఈ దారుణ ఘటనపై ఏపీ హోంమంత్రి అనిత సీరియస్‌ అయ్యారు. విశాఖ సీపీ శంకబ్రత బాగ్చీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు హోంమంత్రి అనిత..  కాగా.. ఈ ఘటన ఏపీలో సంచలనంగా మారింది.. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. దీంతో బాధితురాలి తండ్రి విశాఖ టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. విశాఖ లా విద్యార్థిని సామూహిత అత్యాచార ఘటన సంచలనం అవుతోంది. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. విశాఖ సీపీతో హోంమంత్రి అనిత ఫోన్‌లో మాట్లాడి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ యువకులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. విశాఖలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం ఉండగా ఉంటుందని హోంమంత్రి అనిత తెలిపారు.

Related Posts