రాజన్న సిరిసిల్ల :
బుధవారం వేములవాడ పట్టణంలో జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపద్యంలో జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా బీఆర్ఎస్, బీజేపీ నేతలు, మాజీ సర్పంచులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఉదయాన్నే ఇళ్లల్లోకి వెళ్లి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసుల అక్రమ అరెస్ట్‌లపై పలు ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజా పాలన అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఆరు గ్యారెంటీలపై బీఆర్‌ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తాయని, పెండింగ్ బిల్లులపై మాజీ సర్పంచ్‌లు నిలదీస్తారని, లగచర్ల ఘటనపై గిరిజన సంఘం నాయకులు అడ్డుకుంటారని, రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లపై విద్యార్థి సంఘం నాయకులు గొంతెత్తుతారని, దళితబంధు, ఎస్సీ వర్గీకరణపై ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ నాయకులు రచ్చ చేస్తారనే అనుమానంతో ముందస్తుగా అరెస్టు చేశారు.