YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వలంటీర్‌ వ్యవస్థ కథ ముగిసినట్టే

వలంటీర్‌ వ్యవస్థ కథ ముగిసినట్టే

గుంటూరు నపంబర్ 21,
ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్ల వ్యవస్థ ఉనికిపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అసలు ఆ వ్యవస్థ ఉనికిలో లేదని తేల్చి చెప్పింది. 2023 సెప్టెంబర్‌లో రెన్యువల్ చేయాల్సి ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. జగన్ ప్రభుత్వమే ఆ వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి చెప్పుకొచ్చారు. శాసన మండలిలో వలంటీర్ వ్యవస్థపై తీవ్ర చర్చ జరిగింది. అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. మంత్రి విరాంజనేయస్వామి, మాజీ మంత్రి, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. వలంటీర్ల వ్యవస్థ, వారికి ఇవాల్సిన జీతాలపై వైసీపీ సభ్యులు ప్రశ్నలు అడిగారు. ఈ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం జీవో 5 ద్వారా తీసుకొచ్చారని మంత్రి వివరించారు.2023 సెప్టెంబర్‌ అసలు జీవోనే ఇష్యూ చేయలేదని తెలిపారు. అప్పటి వరకు ప్రతి ఏడాది రెన్యువల్ చేస్తూ వచ్చిన ప్రభుత్వం 2023లో మాత్రం రెన్యువల్ చేయలేదని వివరించారు. అసలు ఆ వ్యవస్థనే కొనసాగించలేదు. లేని వారితో రాజీనామాలు చేయించారన్నారు. లేని వాళ్లను చూపించి ఎన్నికల కోడ్ పేరుతో డ్రామాలు ఆడారన్నారు.  రెన్యువల్ చేసి జీతాలు పెంపును అమలు చేద్దామని చూస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చిందన్నారు మంత్రి డోలా. ఇప్పుడు సాంకేతిక కారణాలతో వారిని కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వారు ఉద్యోగాల్లో లేకపోయినప్పటికీ మే నెల వరకు జీతాలు ప్రభుత్వం ఖజానా నుంచి ఇచ్చారని తెలిపారు. బొత్స సత్యనారాయణ స్పందిస్తూ... వ్యవస్థ ఉందని దాన్ని రెన్యువల్ చేస్తే సరిపోతుందని అన్నారు. ఎన్నికల కారణంగా ఉత్తర్వులు ఇవ్వలేకపోయి ఉండొచ్చని దాన్ని ఇప్పటి ప్రభుత్వం కొనసాగించడంలో అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. దానికి స్పందించిన మంత్రి డోలా... 2020 నుంచి ఏటా రెన్యువల్ జీవోలు ఇస్తూ వచ్చిన జగన్ ప్రభుత్వం 2023లో జీవో ఇవ్వడానికి వచ్చిన అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని ముందే జగన్ గ్రహించారని అందుకే జీవో ఇవ్వలేదని అన్నారు.

Related Posts