YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

80 వేల చేరువలో బంగారం ధరలు

80 వేల చేరువలో బంగారం ధరలు

ముంబై, నవంబర్ 21,
బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. నిత్యం బంగారం, వెండి ధరల్లో మార్పులు వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే పోతున్నాయి. మొన్నటి వరకూ తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మూడు రోజుల నుంచి పెరుగుతూ పోతుండటంతో ధరలు అందనంత పైకి ఎగబాకాయి. బంగారం తిరిగి పది గ్రాములు ఎనభై వేలకు చేరువలో ఉండగా, కిలో వెండి ధర లక్ష రూపాయలు దాటేసింది. దీంతో బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడంపై వినియోగదారులు ఒకింత డైలమాలో పడినట్లే కనిపిస్తుంది. కొనుగోళ్లు గతం కంటే మందగించాయి. నిజంగా ఈ సీజన్ లో కొనుగోళ్లు విపరీతంగా జరగాల్సి ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అయితే తాము ఆశించిన రీతిలో అమ్మకాలు జరగడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మదుపరులు కూడా ఇతర మార్గాలలో పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఇష్టపడుతుండటంతో బంగారాన్ని కొనుగోలు చేసే వారు తక్కువయ్యారని వ్యాపారులు చెబుుతన్నారు. అయితే రానున్న కాలంలో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కొంత ధరలు తగ్గినా తిరిగి ధరలు పెరగడం కొంత ఆందోళన కలిగిస్తుంది.అదే బాటలో వెండి ధరలు ధరలు తగ్గినప్పుడే... బంగారం ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయాలని చూసేవారు ఎక్కువ మంది ఉన్నారు. తక్కువ నగదుతో ఎక్కువ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేయడానికే వినియోగదారులు ఇష్టపడతారు. అందుకే ధరలు పెరిగినప్పుడు సహజంగా కొనుగోళ్లు తగ్గుతాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్పంగానే పెరుగుదల కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నేడు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,160 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,630 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 100,900 రూపాయలకు చేరుకుంది. ఉదయం ఆరు గంటల వరకే ఈ ధరలు నమోదయ్యాయి.మధ్యాహ్నానికి ధరలు పెరగొచ్చు. తగ్గొచ్చు. స్థిరంగా కొనసాగవచ్చని వ్యాపారులు చెబుతున్నారు.

Related Posts