మేడ్చల్
హైదరాబాద్ - కీసర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రాంపల్లి చౌరస్తా వద్ద వరంగల్ జిల్లాకి చెందిన ఎలందర్ (35) అనే వ్యక్తి తాను నిర్మిస్తున్న ఇంటిని చూసేందుకు స్కూటీ పై వెళ్తుండగా వెనుక నుండి వచ్చిన లారీ ఢీ కొట్టి కింద పడ్డాడు. స్థానికులు గమనించి కేకలు లారీని ఒక్కసారిగా రివర్స్ చేయడంతో ఎలందర్ రెండు కాళ్ల పై నుండి వెళ్ళింది, రెండు కాళ్ళు నుజ్జు నుజ్జు అయ్యాయి. రక్తం మడుగులో ఉన్న ఎలందర్ నొప్పితో అల్లాడుతూ తనను కాపాడమని వేడుకున్నాడు అక్కడ ఉన్న జనం ఫోటోలు, వీడియోలు తీస్తూ 108 వెహికల్ వచ్చే వరకు గడిపారు. 108 వచ్చి ఆసుపత్రికి తరలించే లోపు ఎలందర్ మృతి చెందాడు. మృతునికి ఇద్దరు చిన్నపిల్లలు, భార్య ఉన్నారు.