హైదరాబాద
నటుడు రామ్ చరణ్ వేంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని తెలంగాణ అయ్యప్ప జేఏసీ డిమాండ్ చేసింది. అయ్యప్ప మాలలో ఉండి దర్గాకు ఎలా వెళ్తారు ? ఏ ఆర్ రెహమాన్ కుట్ర పూర్వకంగానే రామ్ చరణ్ ని దర్గాకు వెళ్లమన్నారు. రామ్ చరణ్ రెహమాన్ ని కూడా తిరుపతి, శబరి లకు తీసుకరాగలరా ? ఒకపక్క పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి పోరాడుతుంటే ఇంకోపక్క వాళ్ల అబ్బాయి అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్ళాడు. రామ్ చరణ్ నుంచి సమాధానం కోసం నాలుగైదు రోజులు ఎదురు చూస్తాం. ఎలాంటి స్పందన లేకపోతే మా ఆందోళనను ఉధృతం చేస్తామని తెలంగాణ అయ్యప్ప జేఏసీ హెచ్చరించింది.