సంగారెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపితే సీఎం రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. రంగనాయక సాగర్ వద్ద ఇరిగేషన్ భూములు నేను తీసుకున్నానని సీఎం రేవంత్ చెబుతున్నారు. కబ్జాలు చరిత్ర నీది, కబ్జాల ఆలోచన నీది. నేను రైతుల దగ్గరి నుంచి 13 ఎకరాల పట్టా భూమి తీసుకుని ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నా. అందులో ఒక్క గుంట ఇరిగేషన్ భూమి కానీ ప్రభుత్వ భూమి ఉంటే దేనికైనా సిద్ధం. అవసరం అయితే రంగనాయక సాగర్ దగ్గరికి రా ఇద్దరం కలిసి భూమిని కొలుద్దాం. నీ అన్యాయలపై మాట్లాడితే కేటీఆర్ ని అరెస్ట్ చేస్తా అని బెదిరిస్తున్నావని అన్నారు,.