YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఏటా పెరుగుతున్న రిటైర్మెంట్ భారం

ఏటా పెరుగుతున్న రిటైర్మెంట్ భారం

హైదరాబాద్, నవంబర్ 22,
ఆరు గ్యారెంటీల అమలు..సంక్షేమ పథకాలు..అప్పులకు వడ్డీలు-ఇన్‌స్టాల్ మెంట్స్.. ఇలా తలకు మించిన భారంతో అసలే ఆర్ధిక కష్టాల్లో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు టెన్షన్ వచ్చి పడిందట. ఉద్యోగుల రిటైర్మెంట్‌ టాపిక్‌ రేవంత్‌ సర్కార్‌ను కలవర పెడుతోందట. ఈ ఏడాది చివరకు రిటైర్ అవుతున్న 8 వేల మంది ఉద్యోగులతో పాటు వచ్చే ఐదేళ్లలో రిటైరవుతున్న 44 వేల మంది ఉద్యోగులకు బెనిఫిట్స్ ఎలా చెల్లించాలన్న ఆలోచనలో పడింది కాంగ్రెస్ సర్కార్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల ఏజ్ లిమిట్ 58 నుంచి 61 ఏళ్లకు పెంచారు. వాళ్ల రిటైర్‌మెంట్‌ గడువు ఈ సర్కార్‌ హయాంలో ముగుస్తుంది. దీంతో ఒక్కసారిగా రిటైర్ అవుతున్న ఉద్యోగుల భారం రేవంత్ సర్కార్‌పై పడుతుందని అంటున్నారుపదవీ విరమణ తర్వాత ప్రభుత్వ ఉద్యోగికి చెల్లించాల్సిన బెనిఫిట్స్‌ చాలానే ఉంటాయి. వారి బేసిక్‌ పేకు అనుగుణంగా HRA, సీసీఏ, డీఏలను కలుపుకుని మొత్తం వేతనానికి 10 రెట్లు లీవ్‌ శాలరీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లీవ్‌ శాలరీల మొత్తం ఒక్కో ఉద్యోగికి సగటున 8 లక్షల వరకు ఉంటుందట. అలాగే గ్రాట్యుటీ కింద 12 లక్షలు, కమ్యుటేషన్‌ రూపంలో మరో 20 లక్షల రూపాయలు చెల్లించాలి. వేతనం నుంచి నెలనెలా దాచుకున్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌, గ్రూప్‌ ఇన్సురెన్స్‌, సరెండర్ లీవ్‌లు అన్ని కలుపుకుని ఒక్కో ఉద్యోగికి సగటున 30 నుంచి 50 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ డిసెంబర్‌ చివరి నాటికి 8 వేల మంది ఉద్యోగులు రిటైర్ కానున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.2025 డిసెంబర్ నాటికి దాదాపు 10 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో 2026, 2027లోనూ దాదాపు 10 వేల మంది చొప్పున ఉద్యోగులు రిటైర్ అవ్వనున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 2028లో మరో 8 వేల మంది పదవీ విరమణ చేస్తారు. ఇలా రిటైర్డ్ అవుతున్న ఉద్యోగులకు చెల్లించడానికి ప్రభుత్వానికి అదనంగా ప్రతి సంవత్సరం దాదాపు 5 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంటున్నారు అధికారులు. అంటే నెలకు తక్కువలో తక్కువ 400 కోట్లు వీరికే కేటాయించాలన్నమాట.ఈ సంవత్సరం ఇప్పటికే రిటైరైన ఉద్యోగులతో పాటు, ఈ డిసెంబర్‌లో రిటైర్ అవుతున్న ఉద్యోగులకు దాదాపు 3 వేల 200 కోట్ల వరకు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. అసలే ఆర్ధిక కష్టాలను ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రభుత్వం రిటైర్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించే పరిస్థితుల్లో లేదని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల ఏజ్ లిమిట్‌ను పెంచడమే ఇప్పుటి పరిస్థితికి కారణమన్న వాదన వినిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుంచి 61 ఏళ్లకు పెంచారు కేసీఆర్‌. 2021లో తీసుకున్న ఈ నిర్ణయంతో 2024 మార్చి 31 వరకు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్లు దాదాపు జరగలేదు. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాళ్లకు ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం రాలేదు. కేసీఆర్ హయాంలో మూడేళ్ల పాటు రిటైర్మెంట్లు లేకపోవడం..రేవంత్ అధికారంలోకి వచ్చిన 3 నెలల నుంచే పదవీ విరమణలు మొదలవడంతో ఒక్కసారిగా భారం మీద పడుతోందట. రిటైరైన ఉద్యోగులకు బెనిఫిట్స్‌ పే చేయడం కాంగ్రెస్ సర్కార్‌కు కష్టంగా మారిందట.ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2022 జులైకి సంబంధించిన డీఏ ప్రకటించింది. ఇంకా మరో నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయ్‌. ఇక కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులు సాధారణ జీవిత బీమా కింద జమ చేసుకున్న ఫండ్స్‌ను వాడుకుంది. ఇప్పుడు రిటైరయ్యే ఉద్యోగులకు వారి జీఎల్ఏ పాటు జీపీఎఫ్ ఇంట్రెస్ట్‌ కూడా చెల్లించాల్సి వస్తోంది. ఇవన్నీ రేవంత్‌ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారాయని తెలుస్తోంది. వచ్చే ఐదేళ్లలో ఏకంగా 44 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. వీళ్లందరికి రిటైర్మైంట్‌ బెనిఫిట్స్‌ కింద సగటున 30 లక్షల నుంచి కోటి రూపాయల వరకు చెల్లించాలి. అంటే వచ్చే ఐదేళ్ల కాలంలో ప్రభుత్వంపై దాదాపు 20 వేల కోట్ల రూపాయల భారం పడొచ్చని అంచనా వేస్తోంది ఆర్థిక శాఖ. అందుకే ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.పక్క రాష్ట్రం ఏపీలో ఉద్యోగుల రిటైర్మెంట్‌ ఏజ్‌ 62 ఏళ్లుంటే..తెలంగాణలో 61 ఏళ్లుగా ఉంది. అలా ఏడాది పెంచితే ఎలా ఉంటుందని లెక్కలు వేసుకుంటుందట ప్రభుత్వం. ఏడాది తర్వాత అయినా బెనిఫిట్స్ ఎలా సెటిల్ చేస్తామని చర్చోపచర్చోలు జరుపుతుందట. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచడమా లేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను బాండ్స్ రాసివ్వడమా.? మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్‌లో చెల్లించడమా అనే డైలమాలో ఉందట రాష్ట్ర ప్రభుత్వం.

Related Posts