అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మధ్య చరిత్రాత్మక సదస్సుకు సమ యం దగ్గరపడింది. మంగళవారం ఇరువురు నేతలు సింగపూర్‌లో సమావేశం కానున్నారు. సమావేశంలో పాల్గొనేందుకు కిమ్ జోన్ ఉంగ్ ఆదివారమే సింగ పూర్ చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సింగపూర్‌కు బయలుదేరారు. చరిత్రాత్మక సమావేశం నేపథ్యంలో సమావేశం జరగనున్న సెంటోసా ద్వీపంలో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. అంతకుముందు ఛంగీ ఎయిర్‌పోర్ట్‌లో సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రి వివియన్ బాలకృష్ణన్ ఉత్తరకొరియా అధినేతకు ఘనస్వాగతం పలికారు. దశాబ్దాల తరువాత ఉత్తర కొరియా, అమెరికాకు చెందిన రెండు దేశాల నాయకులు సమావేశం కాబో తుండటం ఇదే తొలిసారి. చైనా ప్రభుత్వంలో సీనియర్ అధికారులు ఉపయో గించే ఎయిర్ చైనా బోయింగ్ 747 ప్రత్యేక విమానంలో కిమ్ తన బృందం తో సింగపూర్ వచ్చారు. అనంతరం సింగపూర్ ప్రధాని లీ లూంగ్‌తో సమా వేశమయ్యారు మరోవైపు, ఆదివారం రాత్రి 8: 30 గంటలకు డొనాల్డ్ ట్రంప్ సింగపూర్ చేరుకున్నారు. సోమవారం లీతో ట్రంప్ భేటీ కానున్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ట్రంప్, కిమ్‌ల భేటీ జరగనుంది. కొద్దిరోజులుగా అమెరికా, ఉత్తరకొరియా మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. అమెరికా హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణులను పరీక్షించింది. ఒకదశలో రెండు దేశాల మధ్య యుద్దం తప్పదేమోనన్న వాతావరణ కనిపించింది. చైనా జోక్యంతో ఉత్తరకొరియా ఒకింత దిగివచ్చింది. ఇందులో భాగంగా అమెరికా తో చర్చలకు ఆ దేశం అంగీకరించింది. ఇందులో భాగంగా కొద్దిరోజుల క్రితం దక్షిణ కొరియా అధ్యక్షుడితోనూ కిమ్ జోంగ్ ఉన్ సమావేశమయ్యారు. ట్రంప్, ఉన్ సమావేశంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తితో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 60 ఏళ్ల తర్వాత రెండు దేశాల అధినేతలు ఒకేవేదికపై కనపడనుండటంతో ఉత్కంఠత నెలకొంది. తిరిగి కొరియా ద్వీపకల్పంలో శాంతి వెల్లివిరుస్తుందనే విశ్వాసం ఏర్పడింది. అయితే.. ఈ చర్చలు సామరస్యపూర్వకంగా సాగితేనే ఫలితం ఉంటుందని, శాంతి నెలకొం టుందనే నమ్మకం ఏర్పడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.