అగ్రరాజ్యం బయట పెట్టే దాక అదానీ, జగన్ లంచాల గురించి తెలియలేదు. ఇక్కడ ఉన్న ప్రభుత్వ శాఖలు ఏం చేస్తున్నట్లు ? అంతర్ జాతీయ స్థాయిలో మన దేశ అవినీతి గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇది మన దేశానికి అవమానం. అదానీ దేశ పరువు తీస్తే... జగన్ ఆంధ్ర రాష్ట్రం పరువు తీశాడు. ఒక్క డీల్ లో 1750 కోట్లు లంచమా ? జగన్ గారు మీకు ఆంధ్రరాష్ట్ర ప్రజల ప్రయోజనాలు గుర్తుకు రాలేదా ? మీకు లంచాలు... ఇక్కడ డిస్కం లకు నష్టాలు. మీకు1750 కోట్లు లంచాలు..ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన 17 వేల కోట్ల సర్దుబాటు చార్జీలు మీ లంచాల కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీ కి తాకట్టు పెడతారా ? గుజరాత్ లో ఇదే అదానీ యూనిట్ కి 1.99 పైసలు అమ్ముతున్నాడు. ఆంధ్రలో మాత్రం 2.49 పైసలకు అగ్రిమెంట్ చేసుకున్నారు. 1750 కోట్ల లంచం తీసుకొని ప్రజల నెత్తిన అదానీ పవర్ భారాన్ని మోపారు. 25 ఏళ్లు డీల్ కి పడే ప్రజలపై పడే భారం లక్ష కోట్లు. ఈ లక్ష కోట్లు అధనికి దోచుపెట్టే కుట్రలో మీ లంచం ఎంత ? లంచాలు ఇస్తే ప్రజల మనోభావాలను తాకట్టు పెడతారా? జగన్ అవినీతి పరుడు అని ప్రపంచం మొత్తం చర్చ చేస్తోందితదత. ఇది వైఎస్ఆర్ కుటుంబానికి, రాష్ట్రానికి అవమానం. ప్రజలు 5 ఏళ్లు అధికారం ఇస్తే దాన్ని దుర్వినియోగం చేశారు. 1750 కోట్ల లంచాలకు ఆశ పడి జగన్ రిప్యూటేషన్ ను తాకట్టు పెట్టాడు. అదానీ తో ఇదొక్కటే కాదు... ఇక్కడ జరిగిన ప్రతి డీల్ లో లంచాలు తీసుకొని ఉంటాడు. ప్రతి డీల్ లో లంచాలు తీసుకున్నాడు. ఎటువంటి దర్యాప్తులు లేవు కాబట్టి బయటపడటం లేదు. రాష్ట్రాన్ని అదానీ కి జగన్ తాకట్టు పెట్టాడు. గంగవరం పోర్టు ను అప్పనంగా అమ్మేశాడు. కేవలం 640 కోట్లకు అదానీ కి కట్టబెట్టారు. 30 ఏళ్ల తర్వాత గంగవరం పోర్ట్ ప్రభుత్వానికి చెందాలి. 10 శాతం ఉన్న వాట ను అమ్మేశారు. 9 వేల కోట్ల విలువ జేసే 10 శాతం వాట ను కేవలం 640 కోట్లకు అమ్మడం ఏంటి ? ఇలా అమ్మితే ఎంత కమీషన్ తీసుకున్నారు ? - కృష్ణపట్నం పోర్టు బెదిరించి అదానీ కి ఇప్పించారని ఆరోపించారు.
రాష్ట్రం మొత్తం కోల్ సప్లై చేసే కాంట్రాక్టు అదానీ కి ఇచ్చారు. బీచ్ శాండ్ కాంట్రాక్టు మొత్తం అదానీ చేతుల్లో పెట్టారు. విశాఖ లో సబ్ మెరైన్ కాంట్రాక్టు కూడా అదానీ చేతుల్లో పెట్టాలని అనుకున్నారు. అదానీ కి ఇచ్చిన కాంట్రాక్టు లకు ఎంత లంచం తీసుకున్నారు ? చంద్రబాబు ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. విద్యుత్ కొనుగోలు అగ్రిమెంట్ ను రద్దు చేయండి. అదానీ కంపెనీని ఏపిలో బ్లాక్ లిస్ట్ లో పెట్టండి. జగన్ కుదుర్చుకున్న ఒప్పందాలను రివ్యూ చేయాలి. ఈ దేశంలో వందల కొద్ది మోదాని స్కాం లు ఉన్నాయి. దేశం మొత్తం ఇంత స్కాం లు జరుగుతున్నా మోడీ చర్యలు లేవు. ఇప్పుడు అమెరికా అదానీ అరెస్టు వారెంట్ ఇచ్చింది. ఇప్పటికైనా మోడీ స్పందించాలని అన్నారు.
అదానీ పై చర్యలు తీసుకోవాలి. లేకుంటే మోడీ కూడా అదానీ అవినీతిలో భాగం. అదానీ గత 10 ఏళ్లలో బాగా ఎదిగాడు. దేశంలో రెండో ధనవంతుడు. ఇది మోడీ అండ లేకుంటే సాధ్యం కాదు. అమెరికాలో అదానీ బండారం బయట పడటం ఈ దేశానికి అవమానం. మోడీ నీ ఒక ప్రశ్న కు సమాధానం చెప్పాలని అడుగుతున్నాం. ఇండియా - అమెరికా మధ్య ఒప్పందాలు ఉన్నాయి. ఎక్కడ నేరస్తుడు పట్టుబడిన వెంటనే ఆ దేశానికి అప్పగించాలి. మరి అదానీ నీ మోడీ అమెరికా కి అప్పగిస్తారా ? మోడీ నిర్ణయం ఎంటో తేల్చాలి. మీ నిర్ణయం కోసం దేశ ప్రజలు అంతా చూస్తున్నారు. రేవంత్ ను కూడా విజ్ఞప్తి చేస్తున్న. అదానీ విషయంలో పునరాలోచన చేయాలని అన్నారు.
జగన్ మొన్న ఒక వీడియో ప్లే చేశారు. జగన్ కి నిజంగా చెల్లెలి మీద ప్రేమ ఉండి ఉంటే, బాలకృష్ణ లేదా ఆయన బిలింగ్ నుంచి తప్పుడు ప్రచారం జరిగింది అని తెలిసి ఉంటే, మీరు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా అన్నారు. అప్పుడు గాడిదలు కాశారా? ఎందుకు బాలకృష్ణ మీద విచారణ జరిపించలేదు ? చెల్లెలి మీద ప్రేమ ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు. నాకు అక్రమ సంబంధాలు అంట కట్టిన వాళ్ళు ఎవరో కూడా నాకు ఇప్పటికీ తెలియదు. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్న. గత 5 ఏళ్లుగా నీ సోషల్ మీడియా సైన్యం తో నాపై తప్పుడు ప్రచారం చేయించలేదా ? మీకు అవసరం అనుకుంటే అందరినీ వాడుతారు. చివరికి నా వీడియో కూడా వాడుతారు. అమ్మపై కేసు పెడతారు.. నాన్న పేరు సీబీఐ ఛార్జ్ షీట్ లో పెట్టిస్తారు. మీకు మీరే సాటి జగన్ సార్ అని వ్యాఖ్యానించారు. .