YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

స్పీకర్ చేతిలో గులాబీ నేతల భవితవ్యం

స్పీకర్ చేతిలో గులాబీ నేతల భవితవ్యం

హైదరాబాద్, నవంబర్ 23,
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టులో అందరూ ఊహించిన తీర్పే వచ్చింది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోండి అంటూ స్పీకర్ కు సూచించింది హైకోర్టు. ఒకటి న్యాయవ్యవస్థ, ఇంకొకటి శాసన వ్యవస్థ. వేటికవే స్వతంత్రత ఉంది. ఎవరైనా సరే చట్టప్రకారం నడుచుకోవాలి. పదో షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దానికి ఇంత సమయం అంటూ ఏదీ లేదు. అందరినీ విచారించి, వివరణ తీసుకుని చేయాల్సి ఉంటుంది. గులాబీ బాపు జాతకం అస్సలు బాగున్నట్లు కనిపించడం లేదు. ఒకప్పుడు పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉండేది. గురు మహర్దశ నడిచింది. కానీ ఇప్పుడు కాదు. నాడు అధికారం ఉన్నప్పుడు ఎమ్మెల్యేల చేరికల గురించి సారు దంచిన డైలాగ్స్ చూశారు కదా. ఏరు దాటక ముందు ఒకటి, ఏరు దాటాక ఇంకొకటి. మీకే ఆకర్షణ ఉంటే ఎలా వస్తారండీ.. అన్నారు. మరిప్పుడు ఏమైంది మీ ఆకర్షణ? ఎమ్మెల్యేలు ఎందుకు చేజారుతున్నారు? కొంచమైనా అర్థమవుతోందా? మీకు మీరు కంట్రోల్ చేసుకోవాలన్నారు.. ఇతరులపై ఏడ్వడం కరెక్ట్ కాదన్నారు. మరిప్పుడు మీ ఎమ్మెల్యేలు పార్టీ మారితే.. తమరు చేస్తున్నదేంటి సారూ.. అన్న ప్రశ్నలు కాంగ్రెస్ వైపు నుంచి వస్తున్నాయి. అప్పుడు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు కారెక్కితే కరెక్టు.. ఇప్పుడు కారు దిగి అధికార కాంగ్రెస్ లోకి వెళ్తే మాత్రం రాంగ్. ఇదెక్కడి దిక్కుమాలిన లాజిక్ భయ్యా? అని కడిగిపారేసే వారు ఎక్కువయ్యారు. అంతే కాదు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన అదో భయంకరమైన తప్పు జరిగినట్లు, అన్యాయం జరిగినట్లు.. సీన్ క్రియేట్ చేసుడేందని అన్నది కూడా ఈ పెద్దాయనే. మరిప్పుడు అదే ప్రశ్నలు మీకే ఎదురవుతున్నాయి. గులాబీ పార్టీకి అన్యాయం జరిగితే తామేం చేస్తామన్నది కాంగ్రెస్ నేతల ప్రశ్నటైం ఎప్పుడూ ఒక లెక్కే ఉంటదనుకున్నారో ఏమో మరి. ఇప్పుడు మాత్రం తమ ఎమ్మెల్యేలు పార్టీ మారడం అదో భయంకరమైన తప్పు అన్నట్లుగా గులాబీ పార్టీలో హడావుడి పెరిగింది. అయ్యయ్యో చాలా అన్యాయం జరిగిపోయిందంటూ కోర్టులకెక్కారు. హైకోర్టు, సుప్రీందాకా వెళ్తామన్నారు. మీకే గనుక…, కాపాడుకునే శక్తే గనుక.. ఉండి ఉంటే.. ఇలా జరిగి ఉండేదా అని కాంగ్రెస్ నేతలు పాత డైలాగ్ లను జస్ట్ రిమైండ్ చేస్తున్నారు.మీకు ఆకర్షణ ఉంటే, నాయకత్వ పటిమ ఉంటే ఎందుకు కేసీఆర్ ను ఎమ్మెల్యేలు విడిచిపెడుతారని హస్తం నేతలు అడుగుతున్నారు. చెప్పాలంటే కేసీఆర్ డైలాగులన్నీ ఆయనకే రివర్స్ అయ్యాయి. నిజానికి గులాబీ పార్టీ నుంచి ఇప్పటికి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. అందులో బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు.. హస్తం పార్టీలో మొదట జాయిన్ అయ్యారు. వారిపై అనర్హత వేటు వేయాలంటూ BRS ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, వివేకానంద్‌లు పిటిషన్లు దాఖలు చేశారు. వీటితో పాటు దానం నాగేందర్‌పై వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మరో పిటిషన్‌ వేశారుఅయితే ఈ అనర్హత పిటిషన్‌లపై స్పీకర్ కార్యాలయంలో లేట్ అవుతుండడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 9న దీన్ని విచారించిన హైకోర్టు సింగిల్‌ జడ్జి.. 4 వారాల్లో అనర్హత పిటిషన్‌లపై షెడ్యూల్ ఖరారు చేయాలని తీర్పు ఇచ్చారు. సో అప్పుడు గులాబీ నేతల సంబరం ఒక్కటికాదు. ఇక అయిపోయింది.. స్పీకర్ నిర్ణయం తీసుకోవడమే తరువాయి. బైపోల్స్ వచ్చేస్తాయ్.. ఇక గెలిచేస్తాం.. తడాఖా చూపుతాం.. ఆ ఊహులకు అడ్డే లేకుండా పోయింది. అయితే కలలన్నీ నిజం కావు కదా. తాజాగా హైకోర్ట్ డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో ఆ కలలన్నీ కరిగిపోయాయిసింగిల్‌ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ కు వెళ్లారు. వాటిపై ఇటీవలే వాదనలు ముగియగా.. హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై షెడ్యూల్ ఖరారు చేయాలంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సీజే ధర్మాసనం కొట్టేసింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది. 10వ షెడ్యూల్‌ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలన్నది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, ఐదేళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకొని స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ రెండు వేర్వేరు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థలు. ఎవరి పరిధి వారిదే. అందుకే స్పీకర్ కు కోర్టులు ఆదేశాలు ఇవ్వవుచట్టప్రకారం, చట్టానికి లోబడి నిర్ణయాలు తీసుకోవాలని సూచనలు మాత్రమే చేస్తాయి. సో ఇక్కడ జరిగింది చాలా క్లియర్ కట్ మ్యాటర్. టెన్త్ షెడ్యూల్ ప్రకారం స్పీకర్ ఫలానా టైంలోపల నిర్ణయం తీసుకోవాలన్న రూల్ లేదు. ఎందుకంటే వారు పార్టీ ఎందుకు మారారు.. అసలు మారారా లేదా.. మారితే ఎందుకు మారారు. ఏం ఇబ్బంది వచ్చింది.. టెక్నికల్ గా, చట్టపరంగా అన్ని అంశాలను బేరీజు వేసుకుని స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.గులాబీ నేతలు అనుకున్నట్లు రాత్రికి రాత్రి తీసుకోవడానికి వీలు పడదు. సో ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే.. గతంలో ఎమ్మెల్యేలను ఆకర్షించినప్పుడు, ఎల్పీలను విలీనం చేసుకున్నప్పుడు గుర్తుకు రాని అన్యాయం.. ఇప్పుడే గుర్తుకు రావడం అసలు పాయింట్. అప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఇప్పుడు వేగంగా నిర్ణయాలు తీసుకోవాలనడం మరో పాయింట్. ఇదంతా చూస్తున్న వారు నీవు నేర్పిన విద్యయే.. అన్న పాత పద్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. సింపుల్ మ్యాటర్.
 

Related Posts