YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గూగుల్ మ్యాప్ పై కేసు...

గూగుల్ మ్యాప్ పై కేసు...

ముంబై,  నవంబర్ 28,
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఒక కారు ప్రమాదంలో ముగ్గరు మరణించారు. గూగుల్ మ్యాప్స్ చూస్తూ.. కారుని ఒక బ్రిడ్జి మీద నడుపుతుండగా.. అనుకోకుండా ఆ బ్రడ్జి కొంత భాగం లేదు దీంతో కారు బ్రిడ్జి మీద నుంచి అనూహ్యంగా కింద పడింది. ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదానకి నలుగురు ప్రభుత్వ ఇంజినీర్లు, గూగుల్ మ్యాప్స్ కంపెనీని బాధ్యులుగా చేస్తూ దతాగంజ్ పోలీసులు  కేసు నమోదు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలి – బుడౌన్ సరిహద్దుల వద్ద ఈ కారు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి ముందు ఫరుకాబాద్ జిల్లాకు చెందిన సోదరులు నితిన్ (32), అజిత్ (35), వారి స్నేహితుడు.. మెయిన్ పురి జిల్లాకు చెందిన అమిత్ (40) కారులో నోయిడా నుంచి బరేలిలోని ఫరీద్ పూర్ ప్రాంతానికి పెళ్లి కోసం వెళుతున్నారు. అయితే దారి తెలుసుకోవడానికి ఈ ముగ్గురూ గూగుల్ మ్యాప్స్ ఉపయోగించారు. ఆ మార్గంలో దారి ఉన్నట్లు గూగుల్ మ్యాప్స్ చూపించింది. అందుకే రాంగంగా నదిపైన ఉన్న బ్రిడ్జి మీద నుంచి కారులో బయలుదేరారు. కానీ బ్రిడ్జి సగమే ఉంది. దీంతో కారు నేరుగా నదిలో పడింది. అయితే నదిలో నీరు లేకపోవడం వల్ల కారు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో కారులో ఉన్న ముగ్గురూ ప్రాణాలు వదిలారు. ఈ దుర్ఘటనపై విచారణ చేసిన పోలీసులు పబ్లిక్ వర్క్ డిపార్ట్‌మెంట్ (పిడబ్లుడి) కు చెందిన ఇద్దరు అసిస్టెంట్ ఇంజినీర్లు, ఇద్దరు జూనియర్ ఇంజినర్లపై విధులలో నిర్లక్ష్యం చేసిందుకు కేసు నమోదు చేశారు. అలాగే స్థానికంగా గూగుల్ కంపెనీల ప్రతినిధి పేరు కూడా కేసులో నిందితుడిగా నమోదు చేశారు. బుడైన్ జిల్లా కలెక్టర్ నిధి శ్రీవాస్తవ మాట్లాడుతూ.. “భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 105 ప్రకారం.. నలుగురు పిడబ్లుడి ఇంజినీర్లపై కేసు నమోదు చేశాం, మరో గూగుల్ కంపెనీ అధికారి కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు ” ఆమె తెలిపారు.పిడబ్లూడి శాఖ, సేతు నిగం డిపార్ట్‌మెంట్లకు అన్ని రోడ్లు, బ్రిడ్జీలు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు పరిశీలించి.. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించే విధంగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామని ఆమె అన్నారు.ఈ ఘటనపై ఫరీద్ పూర్ పోలీస్ అధికారి ఆశుతోష్ శివం స్పందించారు. “ఈ రాంగంగా నదిపై ఉన్న బ్రిడ్జి కొంత భాగం గత సంవత్సరం వచ్చిన వరదల్లో కొట్టుకుపోయింది. అయిదే అప్పటి నుంచి బ్రిడ్జిపై హెచ్చరికలు సూచించే ఎలాంటి బోర్డులు పెట్టడం లేదా బ్రిడ్జి మూసేయం లాంటి చర్యలు అధికారులు చేపట్టలేదు. అలా చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు.” అని అన్నారు.గూగుల్ కంపెనీ స్థానిక ప్రతినిధి కారు ప్రమాద ఘటన గురించి మాట్లాడారు. “చనిపోయిన వారి కుటుంబాల పట్ల గూగుల్ సంస్థకు సానుభూతి ఉంది. మేము విచారణ ప్రక్రియలో పోలీసు అధికారులతో అన్ని విధాలుగా సహకరిస్తాం” అని చెప్పారు. 2023 సంవత్సరం కేరళలో కూడా ఇద్దరు డాక్టర్లు కారు డ్రైవింగ్ సమయంలో గూగుల్ మ్యాప్స్ అనుసరిస్తూ పెరియార్ నదిలో పడ్డారు. ఈ కారు ప్రమాదంలో కూడా ఇద్దరూ మరణించారు.

Related Posts