YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

విజయ్ దివస్, దీక్షా దివస్ కోసం గులాబీ భారీ ఏర్పాట్లు

విజయ్ దివస్, దీక్షా దివస్ కోసం గులాబీ భారీ  ఏర్పాట్లు

హైదరాబాద్, నవంబర్ 28,
తెలంగాణ రాష్ట్ర సాధనకు చారిత్రాత్మకమైన దినం నవంబర్ 29. 2009 నవంబర్ 29న రాష్ట్ర సాధనకు కేసీఆర్ చావో రేవో అంటూ ఆమరణ నిరహార దీక్షకు కరీంనగర్ నుంచి సిద్దిపేటకు బయలుదేరగా అలుగునూర్ చౌరస్తాలో పోలీసులు అరెస్టు చేశారు.‌ కెసిఆర్ అరెస్టుతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి రాష్ట్ర సాధన సాకారమైంది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ ఆమరణ దీక్షను ప్రారంభించిన నవంబర్‌ 29వ తేదీని బీఆర్ఎస్ దీక్షా దివస్ గా, తెలంగాణ ప్రకటన వెలువడిన డిసెంబర్ 9న విజయ్ దీవస్ గా నిర్వహించే పనిలో బిఆర్ఎస్ నిమగ్నమైంది.పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ నవంబర్ 29న దీక్షా దీవస్ ను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. కెసిఆర్ అరెస్టు అయిన అలుగునూర్ చౌరస్తాలో కేటిఆర్ నేతృత్వంలో దీక్షా దీవస్ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతిపక్ష హోదాలో తొలిసారి నిర్వహిస్తున్న దీక్షా దీవస్ ను సక్సెస్ చేసేందుకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు.సిరిసిల్లలో కేటిఆర్, కరీంనగర్ లో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్యే లు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, పెద్దపల్లిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సన్నాహక సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారుదీక్షా దివస్ సందర్భంగా అలుగునూరులో నిర్వహించే సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కరీంనగర్ హైదరాబాద్, కరీంనగర్ వరంగల్ ప్రదాన రహదారి ముఖ్య కూడలి అలుగునూరు చౌరస్తా కావడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని పోలీసులు దీక్షా దీవస్ సభకు అనుమతించడం లేదు. అయితే మరోసారి సిపిని కలిసి అనుమతి కోరుతామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు.చారిత్రాత్మకమైన కెసిఆర్ అరెస్టు అయిన అలుగునూరు చౌరస్తా లోనే దీక్షా దివస్ సభ నిర్వహిస్తామని ఒకవేళ పోలీసుల అనుమతి ఇవ్వకుంటే కెసిఆర్ దీక్షకు బయలుదేరిన ఉత్తర తెలంగాణ భవన్ వద్ద నిర్వహిస్తామన్నారు. పోలీసులు అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా భారీ ఎత్తున దీక్ష దీవస్ సభ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.సిరిసిల్ల లో దీక్షా దివస్ పై నిర్వహించిన బిఆర్ఎస్ సన్నాహాక సమావేశంలో అధికారులపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. అతిగా ప్రవర్తిస్తున్న కలెక్టర్లు, పోలీస్ అధికారులు రాసిపెట్టుకోండి... కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తే తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.‌ నేనే ఆ బాధ్యత తీసుకుని కచ్చితంగా ఆ పని చేసి చూపిస్తానని స్పష్టం చేశారు. సిరిసిల్ల కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్నాడని ఆరోపించారు.మా పార్టీ నాయకులను పార్టీ మారాలని అడుగుతున్నాడంట... ఇటువంటి సన్నాసిని కలెక్టర్ గా తీసుకొచ్చారని విమర్శించారు. ఎవ్వరూ భయపడవద్దు.. వాళ్లు టీఆర్ఎస్ వెంట్రుక కూడా పీకలేరన్నారు. రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు ఎవరూ మనల్ని ఏమీ చేయలేరని తెలిపారు. కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి, మంత్రి పదవులు అనుభవిస్తున్నారంటే దానికి కేసీఆర్ అనే నాయకుడే కారణమని కేటిఆర్ స్పష్టం చేశారుబాబా సాహెబ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ సాధ్యమైందని కేటిఆర్ తెలిపారు. అందుకే తెలంగాణ ప్రజలంతా ఆయనకు రుణపడి ఉంటారని చెప్పారు. బాబా సాహెబ్ చూపిన బాటలోనే బోధించు, పోరాడు, సమీకరించు అన్న విధానంలోనే కేసీఆర్ పోరాటం చేసి తెలంగాణ సాధించారని తెలిపారు.2009 నవంబర్ 29న కేసీఆర్ అనే బక్క మనిషి, ఉక్కు సంకల్పంతో చేపట్టిన దీక్ష కారణంగానే తెలంగాణ సాధ్యమయిందన్నారు. కేసీఆర్ పోరాటాన్ని ఎన్ని రకాలుగా చిన్నగా చూపే ప్రయత్నం చేసినప్పటికీ... తెలంగాణ ప్రజలు ఆయనను ఎన్నటికీ మరవరని రాజకీయంగా కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అరచేతిలో స్వర్గం చూపటంతో కొన్ని చోట్ల ప్రజలు నమ్మి వాళ్లను గెలిపించి, ఇప్పుడు మోసపోయామని బాధపడుతున్నారని తెలిపారు.రాష్ట్రంలోనే అత్యధికంగా సిరిసిల్లలో నేతన్నలు ఉన్నారు. మరి ఇక్కడ పెట్టాల్సిన నూలు డిపోను వేములవాడ లో పెట్టారని కేటిఆర్ తెలిపారు. గుండుకు దెబ్బ తాకితే మోకాలి మందు పెట్టినట్లు ఉంది రేవంత్ రెడ్డి పని తీరు అని వ్యంగ్యంగా విమర్శించారు. ఏడాది పాలనలో ముఖ్యమంత్రిని ప్రజలు ఇన్ని తిట్లు తిట్టటం నేను ఎప్పుడు చూడలేదని తెలిపారు. ఆ తిట్లు విన్నాక రేషం ఉన్నోడైతే బిల్డింగ్ మీది నుంచి దూకి చస్తాడు...కానీ రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతోందన్నారు.ఏడాది లోపే ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఊహించలేదని, మనం పిలుపునిస్తే ఈ ప్రభుత్వానికి ప్రజలే సంవత్సరీకం పెట్టే పరిస్థితి ఉందన్నారు. మనుషులుగా మనం కూడా తప్పులు, పొరపాట్లు చేసి ఉండవచ్చు. వాటి నుంచి ఏం నేర్చుకున్నామన్నదే ముఖ్యమని తెలిపారు. కేసీఆర్ స్ఫూర్తితో కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా మహా సంకల్ప దీక్ష చేయాల్సి ఉందన్నారు.

Related Posts