హైదరాబాద్, నవంబర్ 29,
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద.. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు.. సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 1275 స్టేషన్‌లను అభివృద్ధి చేయడానికి.. రైల్వే మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 2023లో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌ను ప్రారంభించింది. 'అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ప్రాజెక్ట్ వ్యయం 26.6 కోట్లు. త్వరలో అభివృద్ధి చేయనున్న హైటెక్ సిటీ స్టేషన్ ప్రతిపాదిత డిజైన్‌లు విడుదల చేస్తున్నాం' అని సౌత్ సెంట్రల్ రైల్వే ట్వీట్ చేసింది.అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో తెలంగాణలోని హైటెక్ సిటీ, నాంపల్లి, సికింద్రాబాద్, మలక్‌పేట్, మల్కాజ్‌గిరి, హఫీజ్‌పేట్, ఉప్పుగూడ, బేగంపేట్, ఉమ్దానగర్, యాకుత్‌పురా, మేడ్చల్, జడ్చర్ల, కరీంనగర్, కాజీపేట జంక్షన్, జనగాం, కాచిగూడ, తాండూర్, వికారాబాద్, ఆదిలాబాద్, బాసర, భద్రాచలం రోడ్, మిర్యాలగూడ, నల్లగొండ, గద్వాల్, కామారెడ్డి, ఖమ్మం, లింగపల్లి, మధిర, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, రామగుండం, షాద్‌నగర్, శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ, వరంగల్, రాయగిరి (యాదాద్రి), జహీరాబాద్ స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు.తొలి విడతలో హైటెక్ సిటీ, నాంపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మహబూబాదాద్, మలక్ పేట, మల్కాజ్‌గిరి, ఉప్పగూడ, హఫీజ్‌పేట, కరీంనగర్, రామగుండం, ఖమ్మం, మధిర, జనగామ, యాదాద్రి (రాయగిరి), కాజీపేట జంక్షన్, తాండూరు, భద్రాచలం రోడ్, జహీరాబాద్, ఆదిలాబాద్ స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేలా, రైల్వే స్టేషన్ల రూపురేఖలు మార్చేందుకు ఈ స్కీమ్ కింద నిధులు కేటాయిస్తున్నారు.ఈ పథకం కింద తొలి విడతలో ఏపీలోని 11 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. భీమవరం టౌన్, ఏలూరు, కాకినాడ టౌన్, అనకాపల్లి, నర్సాపురం, నిడదవోలు, సింగరాయకొండ, తాడేపల్లిగూడెం, ఒంగోలు, తెనాలి, తుని రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేయనున్నారు. ఈ స్టేషన్లలో విశాలమైన ప్లాట్‌ఫాంలు, 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ వంతెనలు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ఫర్నిచర్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.