కరీంనగర్, నవంబర్ 29,
కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఏడాదిలో 1206 మొబైల్ ఫోన్ లను దొరకబట్టి బాధితులకు అప్పగించారు,విధానం ఉపయోగించి పోయిన, చోరీకి గురైన ఫోన్ల అచూకీ కనిపెట్టేశారు. ఇలా భారీ సంఖ్యలో ఫోన్లను స్వాధీనం చేసుకుని అసలు యజమానులకు అప్పగిస్తున్నారు.మీ మొబైల్ ఫోన్ పోయిందా.. లేకుంటే ఎవరైనా కొట్టేశారు.. ఏమాత్రం చింతించకండి. సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేస్తే చాలు..విధానం ఉపయోగించిపోయిన ఫోన్ దొరకబట్టి ఇచ్చేస్తారు. అలా కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఏడాదిలో 1206 మొబైల్ ఫోన్ లను దొరకబట్టి బాధితులకు అప్పగించారు.గతంలో ఫోన్ పోయిందంటే ఇక దొరకదు అనే అభిప్రాయం ఉండేది. ఫోన్ పోయిందంటే సర్వం కోల్పోయినట్లు ఫీల్ అయ్యేది. కానీ పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో ఫోన్ ఎక్కడ పోయినా మళ్లీ మన చేతికి అందే సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. 2023 ఏప్రిల్ నెలలో CEIR విధానం అందుబాటులోకి రావడంతో దాన్ని ఉపయోగించి కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఏడాది కాలంలో పోయిన 1206 మోబైల్ ఫోన్ లను దొరకబట్టి సంబందికులకు అప్పగించారు.కరీంనగర్ సైబర్ క్రైమ్ సెల్ పోలీసులు ఒకే రోజు 162 మొబైల్ ఫోన్ లను గుర్తించి బాధితులకు అప్పగించారు. కరీంనగర్ సీసీఎస్ ఏసీపీ కాశయ్య ఆద్వర్యంలో కరీంనగర్లో 162 మందికి, హుజురాబాద్ లో 50 మందికి ఫోన్ లను అందజేశారు పోలీసులు. CEIR ఆధునిక సాంకేతిక వినియోగం ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ లు గుర్తించడం గతంలో కంటే సులభతరం అవడమే కాకుండా మంచి ఫలితాలను అందిస్తున్నామని ఏసిపి కాశయ్య తెలిపారు.ఈ విధానాన్ని ఉపయోగించి ఇప్పటివరకు కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా పోగొట్టుకున్న 1206 మంది మొబైల్ ఫోన్ లను గుర్తించి బాధ్యులకు అప్పంగించటం జరిగిందని తెలిపారు. సెల్ ఫోన్ లను కనిపెట్టేందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందిని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి అభినందించారు.