హైదరాబాద్, నవంబర్ 29,
మహానగరంలో పొల్యూషన్‌తో మానవ మనుగడకు ప్రమాదం పొంచి ఉంది. నగరంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా రోజురోజుకు వాహనాలు పెరుగుతున్నాయి. దీంతో పొల్యూషన్ అత్యధిక స్థాయిలో రికార్డు అవుతోంది. మరీ ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ వాహనాలు, డీజిల్ వాహనాల ద్వారా ఎక్కువగా కాలుష్యం నమోదవుతోంది. పొల్యూషన్ కారణంగా శ్వాసకోస ఇబ్బందులతో మృతుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. నగరంలో వాయు కాలుష్యం కారణంగా గత 10 ఏళ్లలో 6వేల మందికి పైగా చనిపోయారని గణాంకాలు చెబుతున్నాయి. రీసెంట్‌గా ప్రముఖ ఆరోగ్య జర్నల్ ది లాన్సెట్ ప్లానెట్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రజలను ఆదోంళనకు గురిచేస్తోంది. లాస్ట్ ఇయర్ 2023లోనే కాలుష్యంతో 1,597మంది మరణించినట్లు లాన్సెట్ లెక్కలు చెబుతున్నాయి.తెలంగాణలో రవాణా శాఖ లెక్కల ప్రకారం 2024 మే 31 నాటికి మొత్తం వాహనాలు ఒక కోటి 65 లక్షల 65 వేల 130 వాహనాలు ఉన్నట్లు రవాణాశాఖ చెబుతోంది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే సుమారు 80 లక్షలకు పైన వాహనాలు తిరుగుతున్నట్లు అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. వాటి నుంచి రోజుకు 1500 టన్నులకు పైగా కాలుష్యకారకాలు విడుదలవుతున్నాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. దీంతో చర్యలు చేపట్టింది ప్రభుత్వం.కాలుష్యాన్ని నియంత్రించేందుకు 15 ఏళ్లు దాటిన వాహనాలను స్వచ్ఛందంగా స్క్రాప్‌కు తరలించాలని సూచిస్తున్నారు రవాణా శాఖ అధికారులు. హైదరాబాద్ నగరంలో ఢిల్లీ తరహా కాలుష్య పరిస్థితులు రావొద్దనే ముందస్తు చర్యలు చేపడుతున్నారు. భవిష్యత్తు తరాల దృష్ట్యా ఈవీ కొత్త పాలసీని తీసుకొచ్చింది ప్రభుత్వం. అత్యధిక స్థాయిలో ఈవీ రాయితీ ఇస్తోంది. రోడ్డు, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ లో 100శాతం మినహాయింపులు ప్రకటించింది. అంతేకాకుండా చార్జింగ్ స్టేషన్లు మెరుగుపరచడానికి చర్యలకు చేపట్టింది. రాష్ట్రంలో కొత్తగా 6వేల ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ దిశగా తెలంగాణ రెడ్‌కో కసరత్తు వేగవంతం చేసింది. ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం పెరుగుతోంది. దాదాపుగా ఇప్పటివరకు 1 లక్షా70వేల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ పూర్తయ్యాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కువగా టూ, త్రీ, ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేసేందుకు ప్రజలు ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో.. హైదరాబాద్లో వాయు కాలుష్యం కొంత మేర తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొత్తగా వెహికల్ కొనాలని ఆలోచన ఉన్నవారు ఈవీ వైపు మోగ్గుచూపాలని సూచిస్తున్నారు అధికారులు.
సనత్ నగర్ ప్రాంతం... మహానరకం
స్వచ్ఛమైన వాతావరణంలో, గాలిలో సూక్ష్మ దూళి కణాల స్థాయి క్యూబిక్ మీటర్‌కు 50 మైక్రోగ్రాముల లోపు ఉండాల్సి ఉండగా సనత్ నగర్ పారిశ్రామిక ప్రాంతంలో 255 నుంచి 300 మైక్రోగ్రాములుగా నమోదవుతుంది. దీంతో ఈ ప్రాంతంలో ఎక్కువ మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాలు చెబుతున్నాయి. సనత్ నగర్ ఏరియాలలో ఈ నెల 22, 23, 24, 25 తేదీల్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది. ఆ తేదీల్లో 254, 253, 274, 298 గా నమోదైంది. మరో వైపు సిటీలోని ఇతర ప్రాంతాల్లోనూ ఎయిర్ క్వాలిటీ పడిపోతుంది. కొన్ని ఏరియాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మోడరేట్‌గా నమోదవుతున్నది. వాస్తవానికి గాలివాటాన్ని బట్టి గాలి నాణ్యత పెరగడం, తగ్గడం ఉంటుంది. ఒకచోట నమోదయ్యే వాల్యూస్ ఆ ప్రాంత చుట్టుపక్కల నాణ్యతను కూడా సూచిస్తాయి. ఈ లెక్కన నగరంలో చలికాలం గాలి నాణ్యత సరిగ్గా ఉండడం లేదని చెప్పవచ్చు.మరోవైపు బొల్లారం పారిశ్రామిక వాడలో 118, హెచ్‌సీయూ ప్రాంతంలో 128, పటాన్ చెరువులో 151, పాశమైలారంలో 126, సోమాజిగూడలో 121, జూపార్కు వద్ద 102 మైక్రో గ్రాములు ఉంటున్నట్లు అధికారిక లెక్కలు చెపుతున్నాయి.కాలుష్యాన్ని నివారించేందుకు నగరం లోపల, వెలుపల ఉన్న పరిశ్రమలతో వాయు కాలుష్యానికి సంబంధించిన పర్యావరణానికి అనుకూలమైన టెక్నాలజీని ఉపయోగించాలి. సోలార్, విండ్ పవర్ వంటి పునరుత్పత్తి వనరులను ప్రోత్సహించాలి. ప్రతి సంవత్సరం వాయు కాలుష్యాన్ని నివారించేందుకు వీలవుతుందని వాతావరణ కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు చెబుతున్నారు. కాలం చెల్లిన పాత వాహనాలకు రహదారపై తిరగకుండా చూడడం, కొత్త వాహనాలకు ఎమిషన్ ప్రమాణాలను కఠినంగా అమలు చేయడం అవసరమని పీసీబీ సృష్టం చేసింది. నగరంలో మొక్కలు నాటడం, పచ్చని ప్రదేశాలను పెంపొందించడం ద్వారా వాయు నాణ్యత మెరుగుపరవచ్చని తెలిపింది. ప్రజలకు వాయు కాలుష్యం వల్ల జరిగే హాని, దాని ప్రభావాలు, నివారణ మార్గాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. ట్రాఫిక్ నిబందనలను కఠినంగా అమలు చేయాలని పీసీబీ హెచ్చరిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని, పాత పరిశ్రమలను ఆధునికీకరించి కాలుష్యాన్ని తగ్గించడానికి మార్పులు చేయాలని సూచించింది.. పొల్యూషన్లో కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ వంటివి ఉంటాయి. పార్టీ ప్లేట్ మేటర్స్ పీలుస్తున్నప్పుడు అప్పర్ రెసిపీలో ఫిల్టర్ అవుతుంటాయి. వింటర్ సీజన్లో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దాంతో కార్బన్ డయాక్సైడ్ ఒకే దగ్గర కాన్సన్ట్రేట్ అవుతూ ఉంటుంది. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ గాని, రెగ్యులర్‌గా డ్రైవింగ్ చేసేవారు కానీ, రోడ్డుపై వీధి వ్యాపారాలు చేసేవారు కానీ పొల్యూషన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. వారు ఎక్కువగా జాగ్రత్తగా ఉండటం మంచిదని” డాక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు.ఎక్కువగా పొల్యూషన్ బారిన పడే వారికి ఎలర్జిక్ రైనాయిటీస్ అనే ఒక జబ్బు ఎక్కువగా వస్తూ ఉంటుంది. తుమ్ములు రావడం, ముక్కు కారడం, ముక్కలు బ్లాక్ కావడం లాంటి సింటమ్స్ ఉంటాయి. ఒకసారి ఎక్కువ రోజులు ఉండటం వల్ల వేరే ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. లంగ్స్‌లో బ్లాక్ ఐటీస్ అనేది కూడా వస్తుంది. ఆ తర్వాత ఊపిరితిత్తులలో నిమోనియాగాని, సీఓపీడీ గాని వచ్చే అవకాశాలు ఉన్నాయి. తేమ ఎక్కువగా ఉండటం వల్ల చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్‌లు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ చలికాలం బ్యాక్టీరియా ఎక్కువగా గాల్లో తేలాడుతూ ఉంటుంది ఆ సమయంలో ఆ గాలి పీల్చడం వల్ల ఇన్ఫెక్షన్లు ఆల్రెడీ జబ్బు ఉన్న వాళ్లపై ఎక్కువ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. చిన్నపిల్లలలో ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పిల్లలకు ఎలర్జీ ప్రాబ్లమ్‌లు కూడా ఎక్కువగా ఈ మధ్య వస్తున్నాయి. పిల్లలలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండటంలో ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనాలజీ డిసీజ్ ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళకి వస్తుంది. స్మోకింగ్ చేస్తూ ఇటువంటి పొల్యూషన్ ఎక్కువైనప్పుడు ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. పొల్యూషన్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. తప్పకుండా కంటిన్యూగా ఎక్స్పోజింగ్ అయ్యే వాళ్ళు మాస్క్ ఖచ్చితంగా ధరించాలని డాక్టర్ ప్రమోద్ కుమార్ సూచించారు.