YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేసీఆర్ చిత్తశుద్ధి, నిబద్ధత వల్లే రాష్ట్రం సాధ్యమైంది

కేసీఆర్  చిత్తశుద్ధి, నిబద్ధత వల్లే రాష్ట్రం సాధ్యమైంది

హైదరాబాద్
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అని నినాదమిచ్చి రాష్ట్ర సాధన కోసం మృత్యువును సైతం ముద్దాడేందుకు కేసీఆర్  తెగించిన రోజు నేడని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ ప్రజలే శ్వాసగా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఉద్యమం సాగించి..స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన సందర్భం.  ఇన్నేళ్ళు గడిచినా ఆ నాటి పరిస్థితులు ఇంకా నా ముందు కదలాడుతూనే ఉన్నాయి. కేసీఆర్  చిత్తశుద్ధి, నిబద్ధత వల్లే రాష్ట్రం సాధ్యమైంది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు తనపుస్తకంలో కెసిఆర్  నిబద్ధత గురించి ఇలా ప్రస్తావించారు.  కేంద్ర మంత్రిగా మీకు ఏ శాఖ కేటాయించాలి అని అడిగినప్పుడు కేసీఆర్  ఇచ్చిన సమాధానం.
“ప్రణబ్జీ, నా లక్ష్యం మీకు తెలుసు. నాకు ప్రత్యేక తెలంగాణ కావాలి. మీరు నాకు ఏ శాఖను కేటాయించారనేది ముఖ్యం కాదు. మీరేది కేటాయించినా నాకు సమ్మతమే. కానీ దయచేసి తెలంగాణను ఇవ్వండి.” ఇదీ కేసీఆర్ అంటే. ఇదీ ఆయన కమిట్మెంట్.  కేసీఆర్ త్యాగాల ఫలం తెలంగాణ. కెసిఆర్ ఉద్యమ ఫలితం తెలంగాణ అని అయన అన్నారు.

Related Posts