YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

పార్టీకి దూరమవుతున్న ఫైర్ బ్రాండ్ డీకే

పార్టీకి  దూరమవుతున్న  ఫైర్ బ్రాండ్ డీకే
కాంగ్రెస్ పార్టీలో చేరిన అనతి కాలంలోనే కీలక నేతగా ఎదిగి.. ఒక జిల్లానే శాసింసే స్థానంలో నిలిచి, తమ ప్రభుత్వంలో చక్రం తిప్పిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ. కానీ, ఆమె పరిస్థితి ఇప్పుడు మరింత దారుణంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. ఆమెకు తగిన గుర్తింపు మాత్రం దక్కడంలేదు. అందుకే ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నారట.మహబూబ్‌నగర్ జిల్లా నడిగడ్డ రాజకీయ నేతలలో ప్రముఖురాలైన డి.కె.అరుణ గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండో సారి ఎన్నిక అవడమే కాకుండా 2009 శాసనసభ ఎన్నికల నంతరం వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో స్థానం పొంది జిల్లా తరఫున రాష్ట్ర మంత్రివర్గంలో చోటుపొందిన తొలి మహిళానేతగా పేరు సంపాదించింది. విభజనానంతరం టీఆర్ఎస్ హవా కొనసాగుతున్న సమయంలో కూడా 2014లో జరిగిన ఎన్నికల్లో ఆమె టీఆర్ఎస్ అభ్యర్ధిపై ఎనిమిది వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార పీఠాన్ని దక్కించుకుంది. టీఆర్ఎస్ అధికారం చేపట్టాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చాలా మంది టీడీపీ, కాంగ్రెస్ నేతలు గులాబీ గూటికి చేరిపోయారు. అయినా డీకే అరుణ కాంగ్రెస్ కోసమే పని చేశారు. 2019 ఎన్నికల్లో ఎలాగైనా అధికార పీఠాన్ని దక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్.. ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. దీంతో టీడీపీ, బీజేపీ సహా పలు పార్టీల నుంచి జోరుగా వలసలు కొనసాగాయి. ఈ దశలోనే బీజేపీ నేత నాగర్‌ కర్నూలుకు చెందిన నాగం జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన చేరికపై డీకే అరుణ, ఆమె అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.నాగం చేరికను వ్యతిరేకించిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ, సీనియ‌ర్ నేత దామోద‌ర్ రెడ్డి పార్టీని వీడీ, టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఈ చేరిక‌ను మొద‌ట్నుంచీ దామోద‌ర్ రెడ్డి కూడా వ్య‌తిరేకిస్తున్న సంగ‌తి తెలిసిందే. నాగర్ కర్నూల్‌లో స్థానిక నేతగా ఉన్న త‌న అభిప్రాయానికి ఏమాత్రం ప్రాధాన్య‌త ఇవ్వ‌కపోవ‌డంతో ఆత్మ గౌర‌వ స‌మ‌స్య‌గా భావించాన‌నీ, అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నాన‌ని దామోద‌ర్ రెడ్డి చెప్పారు. వరుస చేరిక‌ల‌తో కాంగ్రెస్ బ‌ల‌ప‌డుతోంద‌న్న భావ‌న ఏర్ప‌డుతున్న ఈ త‌రుణంలో, ఒక సీనియ‌ర్ నేత‌, పార్టీకి దాదాపు రెండు ద‌శాబ్దాలుగా క‌ట్టుబ‌డి ప‌నిచేస్తున్న నాయ‌కుడు వెళ్లిపోవ‌డం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశం అయింది.మరో పక్క నాగం చేరిక‌ను మొద‌ట్నుంచీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నది కాంగ్రెస్‌లోని డీకే అరుణ వ‌ర్గం. దామోద‌ర్ కూడా డీకే అరుణ వ‌ర్గీయులే అనేది తెలిసిందే. నాగం చేరిక‌ను అడ్డుకునేందుకు ఢిల్లీకి వెళ్లి మ‌రీ ఈ వర్గీయులు ఫిర్యాదు చేసొచ్చారు కూడా. అయినా నాగంను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంతో ఆమే తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. తనను గౌరవించని కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పాలని భావిస్తున్నారట. ఆమె పార్టీ వీడే ముందు, తెలంగాణలోని పార్టీ పరిస్థితిని రాహుల్ గాంధీతో చర్చించి తుది నిర్ణయం వెల్లడించనున్నారనే టాక్ వినిపిస్తోంది. డీకే అరుణ రాజకీయ రంగ ప్రవేశం చేసింది టీడీపీ నుంచి.. మొదటిసారి శాసన సభకు ఎన్నికైంది మాత్రం సమాజ్‌వాదీ పార్టీ నుంచి.. అయితే తొలిసారి మంత్రి అయింది మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి.

Related Posts