YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

15 ఏళ్ల తర్వాత దీక్షా దివస్ పార్టీకి లైఫ్ వచ్చేనా

15 ఏళ్ల తర్వాత దీక్షా దివస్ పార్టీకి లైఫ్ వచ్చేనా

హైదరాబాద్, నవంబర్ 30,
గత 15ఏళ్లలో ఎప్పుడూ జరపని రేంజ్‌లో దీక్షా దివస్‌ను గ్రాండ్‌ సక్సెస్‌ చేశారు నేతలు. కరీంనగర్‌ అలుగునూరు చౌరస్తా నుంచి..సిద్దిపేట వరకు..ఖమ్మం నుంచి హైదరాబాద్‌ వరకు మరోసారి ఉద్యమం నాటి ఉద్వేగ భరిత సీన్లు కనిపించాయి. దీక్షా దివస్‌తో గులాబీ పార్టీ మళ్లీ సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నం చేస్తున్నారు.  2009 దీక్షా దివస్ నుంచే అగ్గి రాజుకుంది. అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని రగిలించింది. ఇప్పుడు మళ్లీ ఆ చౌరస్తా నుంచే..పోరుకు సిద్దమవుతోంది గులాబీ పార్టీ. 2009లో కేసీఆర్ తెలంగాణ కోసం దీక్ష చేపట్టేందుకు కరీంనగర్‌ నుంచి బయలుదేరగా..అలుగునూరు చౌరస్తాకు రాగానే పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి గులాబీ బాస్‌ను ఖమ్మంకు.. తర్వాత హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. తర్వాత ఉద్యమం పీక్‌ లెవల్‌కు చేరుకుని అనుకున్న లక్ష్యం ప్రకారం 2014లో తెలంగాణ ఏర్పాటు అయిపోయింది. అలా నవంబర్ 29 కేసీఆర్ దీక్ష తెలంగాణ చరిత్రను తిరగరాస్తే..బీఆర్ఎస్‌ పార్టీని ఆకాశానికి ఎత్తింది.ఇప్పుడు మరోసారి దీక్షా దివస్‌ నుంచి పోరుకు రెడీ అవుతోంది గులాబీ పార్టీ. కేసీఆర్ నిరాహార దీక్షకు బయలుదేరి ఎక్కడైతే అరెస్ట్ అయ్యారో అదే అలుగునూరు చౌరస్తాలో పెద్ద ఎత్తున దీక్ష దివస్‌ నిర్వహించింది బీఆర్ఎస్. ఈ ప్రొగ్రామ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. భారీ బైక్‌ ర్యాలీ, జన సందోహం మధ్య దీక్షా దివస్‌ కార్యక్రమం జరిగింది. ఇక సిద్దిపేటలో మాజీమంత్రి హరీశ్‌రావుతో పాటు జిల్లాల్లోనూ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్దఎత్తున కార్యక్రమాలతో హోరెత్తించారు. గత పదిహేను ఏళ్లలో ఎప్పుడూ ఇంత గ్రాండ్‌గా దీక్షా దివస్‌ జరగలేదు. ఈసారి మాత్రం గులాబీ పార్టీ నేతలంతా దీక్షా దివస్‌లో పార్టిసిపేట్‌ చేశారు.దీక్షా దివస్‌ను ఈ రేంజ్‌లో నిర్వహించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడంతో..పార్టీతో పబ్లిక్‌కు ఉన్న ఎమోషనల్‌ అటాచ్‌మెంట్‌ తగ్గిందని భావిస్తున్నారట. అందుకే సెంటిమెంట్‌ను వర్కౌట్ చేయాలని అనుకుంటున్నారట. ఏ కరీంనగర్‌ గడ్డ నుంచి అయితే కేసీఆర్‌ నిరాహార దీక్ష మొదలుపెట్టారో అక్కడి నుంచే మళ్లీ పునర్‌వైభవం తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. కేసీఆర్ అంటే తెలంగాణ..తెలంగాణ అంటే కేసీఆర్‌ అని పేరు ఎలా ఉందో.. టీఆర్ఎస్‌ అంటే తెలంగాణ..తెలంగాణ అంటే టీఆర్ఎస్‌ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. కానీ బీఆర్‌ఎస్‌గా మారిపోయిన తర్వాత ప్రజల్లో పార్టీ పట్ల అంత అటాచ్‌మెంట్‌ లేకుండా పోయిందని అంచనా వేస్తున్నారట. అందుకే ఆనాటి ఉద్యమ గుర్తులను యాదికి చేసుకుంటూ దీక్షా దివస్‌ను గ్రాండ్‌ నిర్వహించారన్న టాక్ వినిపిస్తోంది.ఇప్పటికే బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా మారుస్తారన్న చర్చ జరుగుతోంది. పార్టీ పేరులో తెలంగాణ పదం లేకపోవడం లోటుగా ఫీల్‌ అవుతున్నారట నేతలు. టీఆర్ఎస్‌ అంటేనే ప్రజల్లో ఒక ఎమోషన్‌ ఉండేదని..బీఆర్‌ఎస్‌గా మార్చడం వల్ల కూడా కొంత డ్యామేజ్‌ జరిగిందని అనుకుంటున్నారట. తెలంగాణ వాదం తమ పేటెంట్‌గా భావిస్తోన్న గులాబీ పార్టీ..తెలంగాణ వాదాన్ని కొనసాగించేలా కార్యాచరణను అమలు చేసేందుకు రెడీ అవుతోంది. తెలంగాణ వాదం నుంచి కార్యకర్తలు విడిపోతే.. చెడిపోతామంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్‌ను బట్టి చూస్తే సెంటిమెంట్‌ అస్త్రాన్ని మరోసారి వర్కౌట్ చేయాలని పార్టీ భావిస్తున్నట్లు స్పష్టం అవుతోంది.మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ప్రాంతీయ పార్టీలు సత్తా చాటడంతో ..తమ పార్టీ కోర్‌ బ్యాగ్రౌండ్‌ అయిన తెలంగాణ స్లోగన్‌ మరోసారి తెరమీదకు తేవాలని ఫిక్స్ అయిపోయిందట గులాబీ పార్టీ. అటు ఎమ్మెల్సీ కవిత కూడా తెలంగాణ జాగృతి పేరు మీదే యాక్టివిటీ చేస్తుండటంతో..బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదాన్ని మళ్లీ భుజాన ఎత్తుకోబోతుందని..సెంటిమెంట్‌ వర్కౌట్ అయ్యేలా ప్లాన్ చేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గులాబీ పార్టీ దీక్షా దివస్‌ అస్త్రంపై అధికార కాంగ్రెస్‌ నేతలు అలర్ట్ అయినట్లే కనిపిస్తోంది. కేసీఆర్ దీక్ష చేయలేదని..ఓయూ విద్యార్థులు శవయాత్ర నిర్వహించిన తర్వాతే దీక్ష చేశారని..తెలంగాణ ఇచ్చింది తామేనని చెప్పుకునే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ లీడర్లు. ఈ నేపథ్యంలో దీక్షా దివస్‌తో బీఆర్ఎస్‌ మొదలుపెట్టిన సెంటిమెంట్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది వేచి చూడాలి.

Related Posts